ETV Bharat / business

భారీగా పడిపోయిన ఆభరణాల ఎగుమతులు - భారీగా పడిపోయిన ఆభరణాల ఎగుమతులు ఈటీవీ భారత్

దేశీయ ఆభరణాల ఎగుమతులు భారీగా క్షీణించాయి. మార్చి నెలలో ఈ ఎగుమతులు 38.81శాతం పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. బంగారు ఆభరణాల ఎగుమతులు 40శాతం, సానపెట్టిన వజ్రాల ఎగుమతులు 45శాతం మేర పతనమయ్యాయి. అయితే వెండి ఆభరణాల ఎగుమతుల్లో మాత్రం గణనీయమైన వృద్ధి నమోదైంది.

JEWELLERY-EXPORTS
భారీగా పడిపోయిన ఆభరణాల ఎగుమతులు
author img

By

Published : May 18, 2020, 6:29 AM IST

కరోనా ప్రభావంతో కార్యకలాపాలన్నీ ఆగిపోవడం, ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంతో కొట్టుమిట్టాడుతుండటం వల్ల దేశీయ ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా.. మార్చి నెలలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 38.81 శాతం క్షీణించాయి.

2019 మార్చిలో రూ. 22,463 కోట్లుగా ఉన్న ఎగుమతుల విలువ.. ఈ ఏడాది మార్చిలో రూ.13,744.60కు పరిమితమైనట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహ మండలి(జీజేఈపీసీ) గణాంకాలు స్పష్టం చేశాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 8.91శాతం పడిపోయి.. రూ.2,51,096 కోట్లకు పరిమితమైంది. కాగా, 2018-19లో రూ.2,75,671 కోట్ల ఎగుమతులు జరిగాయి.

సీపీడీ ఎగుమతుల్లోనూ నిరాశే

కత్తిరించిన, సానపెట్టిన వజ్రాల(సీపీడీ) ఎగుమతులు సైతం మార్చి నెలలో 45శాతం తగ్గాయి. గతేడాది మార్చిలో రూ. 12,910 కోట్లుగా ఉన్న ఎగుమతులు ప్రస్తుతం రూ. 7.100కి పడిపోయినట్లు జీజేఈపీసీ స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్​ నుంచి మార్చి 2020 నాటికి సీపీడీ ఎగుమతులు 20.75శాతం తగ్గిపోయాయని వెల్లడించింది.

రంగు రాళ్ల ఎగుమతులు 2019-20లో 18.18శాతం పడిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 2,777గా ఉన్న ఈ ఎగుమతుల విలువ.. రూ.2,272కి తగ్గిపోయింది.

బంగారు ఆభరణాలు

మార్చిలో బంగారు ఆభరణాల ఎగుమతులు 40 శాతం మేర క్షీణించాయి. గతేడాది రూ. 6,929గా ఉన్న ఎగుమతులు 2020 మార్చి నాటికి రూ.4,152కి పడిపోయాయి. అయితే 2019-20 మధ్య పసిడి ఎగుమతులు 3.57శాతం వృద్ధి చెందాయి.

మెరిసిన వెండి

మరోవైపు... 2019-20 ఆర్థిక సంవత్సరంలో వెండి ఆభరణాల ఎగుమతులు ఏకంగా 105.60శాతం వృద్ధి చెందాయి. 2018-19లో రూ. 5,845 కోట్లుగా ఉన్న ఎగుమతులు... రూ. 12,018కి ఎగబాకాయి.

మొత్తం ఎగుమతులు

2019-20లో మొత్తం ఎగుమతుల విలువ 5.74 శాతం క్షీణించింది. 2018-19లో 25.48 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా.. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య 24 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

దిగుమతులు

కఠిన వజ్రాల స్థూల దిగుమతులు 2019-20 మధ్య 16.25శాతం తగ్గి.. 12.68 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2018-19లో ఈ సంఖ్య 15.14 బిలియన్ డాలర్లుగా ఉంది.

అయితే సీపీడీల స్థూల దిగుమతి మాత్రం 29.12 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018-19లో సీపీడీ దిగుమతులు 1,326.29 మిలియన్ డాలర్లుగా ఉంటే... 2019-20నాటికి ఈ సంఖ్య 1,712.54 మిలియన్ డాలర్లకు చేరింది.

'ప్యాకేజీ ఇవ్వండి'

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం వల్లే ఇలాంటి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయని జీజేఈపీసీ ఉపాధ్యక్షుడు కొలిన్ షా పేర్కొన్నారు. కరోనా సంక్షోభం ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోసినట్లు తెలిపారు. ఆభరణాల పరిశ్రమపై శ్రద్ధ చూపించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో పరిశ్రమకు ఊతమందించేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.