భారతీయ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా అందిస్తున్న ఉచిత వైఫై సేవలు ఇప్పటి వరకు 6,000 స్టేషన్లకు విస్తరించాయి. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్ స్టేషన్‌లో శనివారం ఈ సేవలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఈ మైలురాయిని చేరుకుంది.
ఫ్రీ వైఫై సేవలు తొలిసారి 2016లో ముంబయి రైల్వేస్టేషన్‌లో ప్రారంభమయ్యాయి. అనంతరం దేశంలోని ప్రధాన స్టేషన్లకు ఈ సేవలను విస్తరించారు. బంగాల్‌లోని మిద్నాపూర్ ఈ సేవలు పొందిన 5,000వ స్టేషన్‌గా నిలిచింది.
పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా అందరికీ వైఫై సేవలు అందించడమే లక్ష్యమని రైల్వే శాఖ తెలిపింది. గూగుల్, డీఓటీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా ట్రస్ట్ సహకారంతో రైల్‌టెల్ ఉచితంగా ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.
ఇదీ చదవండి:ఎయిర్టెల్ కొత్త ఆఫర్- రూ.49 రీఛార్జ్ ఫ్రీ!