ETV Bharat / business

అక్టోబరు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ - ఫ్లిప్​కార్ట్​ వార్తలు

ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​.. బిగ్​ బిలియన్​ డేస్​కు (flipkart big billion days) సంబంధించి కీలక ప్రకటన చేసింది. అక్టోబరు 7 నుంచి 12 మధ్య బిగ్​ బిలియన్​ డేస్​ పేరిట రాయితీ విక్రయాలను జరపనున్నట్లు వెల్లడించింది.

flipkart big billion days
అక్టోబరు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌
author img

By

Published : Sep 22, 2021, 2:18 PM IST

పండుగలను పురస్కరించుకుని, ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​ బిగ్‌ బిలియన్‌ డేస్‌ (flipkart big billion days) పేరిట రాయితీ విక్రయాలను అక్టోబరు 7- 12 తేదీల్లో జరపనుంది. లక్షల మంది విక్రేతలు, చిన్న వ్యాపార సంస్థలు, కిరాణా దుకాణాలు, బ్రాండ్లు ఇందులో భాగస్వామ్యం అవుతాయని వెల్లడించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎన్నో ఉత్పత్తులు ఈ విధంగా చిన్న పట్టణాలకు చేరుకుంటాయని పేర్కొంది.

రాయితీ..

యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై 10శాతం వరకు రాయితీ (flipkart offers) లభిస్తుందని తెలిపింది. అవసరమైన వస్తువులను ముందస్తుగా బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కిరాణా దుకాణాలకు రూ.8లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

బిగ్​ బిలియన్​ డేస్​లో భాగంగా ఈ సారి ఎన్నో కొత్త ఉత్పత్తులు, గేమ్స్​, లైవ్​ స్ట్రీమ్స్​ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్​కార్ట్​ పేర్కొంది. డిసెంబరు నాటికి 4.2 లక్షల మంది విక్రయదారులే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​కు 3.75 లక్షల మంది విక్రయదారులు ఉన్నారు.

ఇదీ చూడండి : సోనీ ఇండియాతో జీ ఎంటర్​టైన్మెంట్ విలీన ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.