ETV Bharat / business

ఫేస్​బుక్ నుంచి త్వరలో ఉచిత ఇంటర్నెట్​ - ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉచిత అంతర్జాల సేవలు అందించే దిశగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ ఓ యాప్​ను రూపొందించింది. దక్షిణ అమెరికా దేశం పెరూలో ప్రయోగాత్మకంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్​బుక్.

Facebook testing new app to provide free data in developing countries
ఫేస్​బుక్ నుంచి త్వరలో ఉచిత ఇంటర్నెట్​
author img

By

Published : May 8, 2020, 6:37 AM IST

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉచిత అంతర్జాల సేవలను అందించనుంది. ఇందుకోసం 'డిస్కవర్​' అనే కొత్త యాప్​ను తీసుకువచ్చింది. దక్షిణ అమెరికా దేశం పెరూలో ప్రయోగాత్మకంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్​బుక్.

ఈ డిస్కవర్​ యాప్​ ద్వారా పలు మొబైల్ నెట్​వర్కింగ్ సంస్థలు అందించే డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సేవలను థాయ్​లాండ్​, ఫిలిప్పీన్స్​, ఇరాక్​తో సహా ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు సమాచారం.

డేటా వస్తే గుర్తు చేసేలా..

డిస్కవర్​ యాప్​ ప్రొవైడర్​ ద్వారా ప్రతి రోజూ కొంత ఉచిత డేటా లభిస్తుంది. నోటిఫికేషన్​ వచ్చిన తర్వాత నుంచి ఈ డేటాని వినియోగించుకోవచ్చు. పరిమిత డేటా మాత్రమే అందించే కారణంగా మల్టీ మీడియా కోసం ఇది పనిచేయలేదు. ఆయా వెబ్​సైట్ల​లోని సమాచారాన్ని మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ యాప్​ను ఉపయోగించేందుకు ఫేస్​బుక్​ ఖాతా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది సంస్థ. ఈ యాప్​ ద్వారా బ్రౌజింగ్ హిస్టరీని ఫేస్​బుక్ సేకరించబోదని వెల్లడించింది. యాడ్స్​ కోసం దీనిని రూపొందించలేదని పేర్కొంది.

ఇదీ చూడండి: ఎయిర్​లిఫ్ట్​: 7 రోజులు.. 64 విమానాలు.. 14,800 మంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.