ETV Bharat / business

రాష్ట్రాలకు రూ.15,340కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

2020-21ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు రూ.15,340కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిహారాన్ని విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు పన్నుల వాటా కింద మే నెలకు గాను రూ.46,038.70 కోట్లు మంజూరు చేసినట్లు ట్విట్టర్​ వేదిక ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.

Centre releases Rs 15,340 cr GST compensation to states so far this fiscal
జీఎస్టీ పరిహారం రూ.15,340కోట్లు.. పన్నుల వాటా రూ.46,038.70 విడుదల
author img

By

Published : May 21, 2020, 9:58 AM IST

Updated : May 21, 2020, 10:16 AM IST

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ(వస్తు సేవల పన్ను) వాటా కింద ఇప్పటివరకు రూ.15,340కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. సుంకాల వాటలో రాష్ట్రాలకు రూ.46,038.70 మంజూరు చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ట్వీట్​లో పేర్కొంది. లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థ డీలా పడినప్పటికీ.. పరిహారం కింద రాష్ట్రాలు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేసింది.

2019-20 ఆర్థిక సంవత్సరం(నవంబరు) నాటికి రూ.1,20,498 కోట్లు జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడుదల చేసింది. ఇది 2018-19 (రూ.69,275కోట్లు), 2017-18 (రూ. 41,146కోట్లు)లో విడుదల చేసిన దానికంటే ఎక్కువ. 2017 జులై 1లో జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

పాత బకాయిలు..

2019-20 ఆర్థిక సంవత్సరానికి తక్కువ జీఎస్టీ వసూలు అయినప్పటికీ.. రాష్ట్రాలకు 2019 నవంబరు వరకు పరిహారాన్ని క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే 2019 డిసెంబరు నుంచి 2020మార్చి నెల వరకు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉంది కేంద్రం. 2019-20, 2018-19, 2017-18ఆర్థిక సంవత్సరాల్లో వసూలైన సెస్​ వరుసగా రూ.95,000 కోట్లు, రూ.95,081 కోట్లు రూ. 62,611 కోట్లు.

2019-20, 2018-19, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా రూ .95,000 కోట్లు, రూ .95,081 కోట్లు, రూ .62,611 కోట్లు సెస్​ వసులైనట్లు కేంద్రం తెలిపింది.

పన్నుల వాటా..

కేంద్ర పన్నులు, సుంకాల వాటలో రాష్ట్రాలకు మే నెలకు రూ .46,038.70 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్​లో విడుదల చేసిన మాదిరిగానే ఈ నెల కూడా 2020-21 బడ్జెట్‌లో అంచనా వేసిన పన్ను రసీదుల ఆధారంగా లెక్కించినట్లు వెల్లడించింది.

పన్నుల వాటాను రాష్ట్రాల వారీగా విభజించినట్లుయితే... ఆంధ్రప్రదేశ్​కు రూ.1,892.64కోట్లు, అసోం రూ.1,441.48కోట్లు, గుజరాత్ రూ.1,564.4 కోట్లు, బంగాల్​ రూ.3,461.65 కోట్లు, ఉత్తర్​ ప్రదేశ్‌ రూ.8,255.19 కోట్లు, కేరళ రూ.884.53 కోట్లు, బిహార్‌ రూ.4,631.96 కోట్లుగా ఉన్నాయి.

ఇదీ చూడండి: కరోనా కష్టాల్లోనూ 'డాక్టర్​ రెడ్డీస్'కు రెట్టింపు లాభాలు

Last Updated : May 21, 2020, 10:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.