ETV Bharat / business

జియోలో ఫేస్​బుక్ పెట్టుబడికి సీసీఐ ఆమోదం

జియో ప్లాట్​ఫాంలో ఫేస్​బుక్​ పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం లభించింది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేయడాన్ని ఆమోదిస్తూ సీసీఐ ట్వీట్ చేసింది.

author img

By

Published : Jun 24, 2020, 6:51 PM IST

CCI approves Facebook's 9.99%
జియోలో ఫేస్​బుక్ పెట్టుబడికి సీసీఐ ఆమోదం

జియో ప్లాట్​ఫాంలో ఫేస్​బుక్​ 9.99 శాతం పెట్టుబడి ప్రతిపాదనను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదించింది. జియోలో వాటాల కొనుగోలు చేస్తున్నట్లు ఏప్రిల్​లోనే ఫేస్​బుక్ ప్రకటన చేసింది. రూ.43,574 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.

ఈ ప్రక్రియ ఫేస్​బుక్​ ఆధ్వర్యంలోని జాధూ హోల్డింగ్స్​ ఎల్​ఎల్​సీ సంస్థ ద్వారా జరగాల్సి ఉంది. ఈ మేరకు దీనికి సంబంధించిన పెట్టుబడి పూర్తైనట్లు సీసీఐ స్పష్టం చేసింది. 'జియోలో 9.99 శాతం వాటాను జాధూ హోల్డింగ్స్ కొనుగోలు చేయడాన్ని ఆమోదించాం' అని ట్వీట్ చేసింది సీసీఐ.

మార్కెట్లో సరైన పోటీ ఉంచడం సహా అక్రమ వ్యాపార ధోరణిని అరికట్టడంలో భాగంగా పరిమితికి మించిన పెట్టుబడులకు సీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

గతేడాది అక్టోబర్​లో జియో ప్లాట్​ఫాంను రూపొందించారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఆధ్వర్యంలో ఉన్న అన్ని డిజిటల్ సేవలను ఒక్కతాటికి తీసుకొచ్చారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.