ETV Bharat / business

ప్రీపెయిడ్​ కనెక్షన్​ గడువు పెంచిన బీఎస్​ఎన్​ఎల్​ - BSNL has also launched recharge helpline on a toll-free number for subscribers to get their recharge done.

లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ బీఎస్​ఎన్​ఎల్​ తన వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. మే 5 వరకు ఇన్​కమింగ్​​ కాల్స్ ఉచితంగా పొందే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

BSNL extends prepaid connection validity till May 5
ప్రీపెయిడ్​ కనెక్షన్​ గడువు పెంచిన బీఎస్​ఎన్​ఎల్​
author img

By

Published : Apr 19, 2020, 5:15 AM IST

బీఎస్​ఎన్​ఎల్​ తన ప్రీపెయిడ్​ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాక్​డౌన్​ సమయంలో తమ ఖాతాలను రీఛార్జ్​ చేసుకోలేకపోయిన కస్టమర్లకు మే 5 వరకు ఉచితంగా ఇన్​కమింగ్​ కాల్స్ పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

"లాక్​డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో..... ప్లాన్ గడువు ముగిసిన/ జీరో బ్యాలెన్స్ ఉన్న బీఎస్​ఎన్​ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మానవతా దృక్పథంతో.. అటువంటి చందాదారులకు 2020 మే 5 వరకు ఉచితంగా ఇన్​కమ్​ కాల్స్ స్వీకరించే వెసులుబాటు కల్పిస్తున్నాం."

- బీఎస్​ఎన్​ఎల్​ ప్రకటన

రీఛార్జ్ హెల్ప్​లైన్​

బీఎస్​ఎన్​ఎల్​... తన వినియోగదారులు ఫోన్​ రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా కొత్తగా ఓ టోల్​ ఫ్రీ నెంబర్​తో హెల్ప్​లైన్​ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఈ సౌకర్యం ఉత్తర, పశ్చిమ జోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 2020 ఏప్రిల్ 22 నుంచి దక్షిణ, తూర్పు జోన్లలోనూ ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

"ఈ కరోనా సంక్షోభ సమయంలో బీఎస్​ఎన్​ఎల్... చందాదారుల పక్షాన నిలుస్తుంది. వినియోగదారులు తమ ఖాతాలను రీఛార్జ్ చేసుకోవడానికి 'గో డిజిటల్​'వైపు మరలాలని ఈ సందర్భంగా మేం అభ్యర్థిస్తున్నాం."

- పి.కె.పూర్వర్​, బీఎస్ఎన్​ఎల్​ సీఎండీ

ఇదీ చూడండి: చైనాకు భారత్‌ షాక్‌-ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.