నవంబర్‌లో బ్యాంకులకు (Bank Holidays in November 2021) 17 రోజులు సెలవు రానున్నాయి. ఈ విషయంపై ఆర్బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యోత్సవం, ఛఠ్ పూజా వంటి స్థానిక పండగ రోజుల్లో (Bank Holidays in November 2021) ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
- నవంబరు 1- కన్నడ రాజ్యోత్సవం/కుట్ (బెంగళూరు, ఇంఫాల్)
- నవంబరు 3- నరక చతుర్దశి (బెంగళూరు)
- నవంబరు 4 - దీపావళి (అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెలాపుర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాదూన్, గ్యాంగ్‌టక్, గువాహటి, హైదరాబాద్, ఇంఫాల్, జైపుర్, జమ్మూ, కాన్పుర్, కొచ్చి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, దిల్లీ, పనాజీ, పట్నా, రాయ్‌పుర్, రాంచీ, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం)
- నవంబరు 5- దీపావళి/ విక్రమ్ సంవాత్ న్యూ ఇయర్/ గోవర్ధన పూజ (అహ్మదాబాద్, బెలాపుర్, బెంగళూరు, దేహ్రాదూన్, గ్యాంగ్‌టక్, జైపుర్, కాన్పుర్, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్)
- నవంబరు 6- భాయ్ దూజ్/లక్ష్మీ పూజ/ నింగోల్ ఛకౌబా (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పుర్, లఖ్‌నవూ, షిమ్లా)
- నవంబరు 10- ఛఠ్ పూజ (పట్నా, రాంచీ)
- నవంబరు 11- ఛఠ్ పూజ (పట్నా)
- నవంబరు 12- వంగలా (షిల్లాంగ్)
- నవంబరు 19- గురునానక్ జయంతి/కార్తిక పూర్ణిమ (ఐజ్వాల్, బెలాపుర్, భోపాల్, చండీగఢ్, దేహ్రాదూన్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కాన్పుర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, దిల్లీ, రాయ్‌పుర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్)
- నవంబరు 22- కనకదశ జయంతి (బెంగళూరు)
- నవంబరు 23 - సేంగ్ కుట్సేనెమ్ (షిల్లాంగ్)
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు
- నవంబర్ 4 - దీపావళి (గురువారం)
- నవంబర్ 19 - గురునానక్ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)
- నవంబరు 7, 14, 21 & 28- ఆదివారం
- నవంబరు 13 & 27 - రెండో, నాల్గవ శనివారాలు
ఇదీ చూడండి : బంగారంపై పెట్టుబడికి సిద్ధమవుతున్నారా?- అయితే ఇవి తప్పనిసరి!