ఎన్నికల సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు - కాటంనేని భాస్కర్
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు
విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాల్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్, నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా పరిశీలించారు. పోలీస్ బ్యారెక్స్ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన 4 కేంద్రాలలో ఉదయం నుంచి పోలీసులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న వారి కోసం మరో రెండ్రోజులు గడువు పెంచుతామని కలెక్టర్ తెలిపారు. ఇవాళ నగర, జిల్లా పోలీసులతో పాటు ఆర్టీసీ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ల హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు.
Intro:AP_GNT_28_02_MUSLIM_LEADERS_IN_TDP_AVB_C10
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi
Last Updated : Apr 2, 2019, 11:24 PM IST