ETV Bharat / briefs

సమృద్ధి వర్షాల కోసం... ఊరంతా వనవాసం - anatapur

ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. తమ గ్రామం బాగు కోసం.. ఒక్క రోజంతా వనవాసం చేస్తారు. అలా చేస్తే అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం.

సమృద్ధి వర్షాల కోసం ఊరంతా వనవాసం
author img

By

Published : Apr 29, 2019, 7:23 PM IST

సమృద్ధి వర్షాల కోసం ఊరంతా వనవాసం

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామ వాసులంతా వనవాసం బాటపట్టారు. దశాబ్దాల నుంచి వస్తోన్న ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఏటా శ్రీరామనవమి పండుగ ముగిసిన తర్వాత వచ్చే మొదటి సోమవారం ఒక్క రోజు వనవాసం చేస్తారు.

ఉదయం ఆరుగంటలకే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇళ్లకు తాళాలు వేసి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పొలాల్లోనే వంటలు చేసుకొని రోజంతా గడుపుతారు. గ్రామానికి కాపలాదార్లుగా పది మంది ఊరి చుట్టూ ఉంటారు. సాయంత్రం అయ్యాక ఊరి వాకిలిలో మామిడి తోరణాలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఇలా చేయడం వలన గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని నమ్ముతారు.

ఇవీ చూడండి :

ఆక్రమణలు తొలగింపు.. మహిళల ఆత్మహత్యాయత్నం

sample description

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.