ETV Bharat / state

గుడ్​న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం - టిడ్కో ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ - CRDA 44TH AUTHORITY MEETING

సీఎం అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ 44వ స‌మావేశం - మరో రూ.2,700 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు ఆమోదంపై చర్చ

CRDA_AUTHORITY_MEETING
CRDA 44th Authority Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2024, 3:01 PM IST

CRDA 44th Authority Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ 44వ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో 2,723 కోట్ల రూపాయల రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సీఎం ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12 కల్లా 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ 44వ స‌మావేశం జరిగింది.
ఎల్పీఎస్ జోన్ 7, జోన్ -10లో మౌలిక వ‌సతుల క‌ల్పన‌కు సమావేశం నిర్ణయం తీసుకుంది. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపైనా చర్చించారు. ఇప్ప‌టివ‌ర‌కూ 47, 288 కోట్ల రూపాయల విలువైన ప‌నులు చేప‌ట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.

టిడ్కో గృహాలపైనా చర్చ : టిడ్కో గృహాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకుని, 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టిందని నారాయణ గుర్తు చేశారు. 3.90 లక్షల రూపాయలు ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 7 లక్షల ఇళ్లు పూర్తయ్యేవని తెలిపారు.

జగన్ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లను 2.61 లక్షలకు కుదించిందని విమర్శించారు. ఈ 2.61 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు 7 వేల 512 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. కట్టని ఇళ్లకు గత ప్రభుత్వం రుణం తీసుకుని అనేక సమస్యలు తెచ్చిందని మండిపడ్డారు. బ్యాంకులకు 102 కోట్లు కడితే కానీ ఇళ్ల నిర్మాణం ముందుకు కదలని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. బ్యాంకులకు కట్టాల్సిన 102 కోట్లు విడుదలకు సీఎం ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ ఖర్చు భారం ఏదీ ప్రజలపై పడదని తెలిపారు. భూములు అమ్మకం, రాజధాని అభివృద్ధి ద్వారా జరిగే సంపద సృష్టితోనే రాజధాని నిర్మాణానికి తీసుకునే రుణాలు చెల్లిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరనందుకే సాక్షి మీడియా ద్వారా విష ప్రచారం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.33 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలకు పచ్చజెండా

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ భవనం - రూ.45 వేల 249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.