ETV Bharat / briefs

ప్రధానవార్తలు @7PM - ఏపీ ముఖ్య వార్తలు

...

TOP NEWS
ప్రధానవార్తలు @7PM
author img

By

Published : May 31, 2021, 7:00 PM IST

  • ఆనందయ్య మందుతో కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదు: ఆయుష్‌ కమిషనర్‌

ఆనందయ్య ఔషధం వల్ల కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సింఘాల్​తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఆనందయ్య ఔషధం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌, నష్టం జరిగిందనేందుకు ఆధారాలు లేవన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Corona Cases in AP: కొత్తగా 7,943 కేసులు, 98 మరణాలు

రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా, 7,943మంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 19,845మంది కొవిడ్‌ నుంచి కోలుకుని బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 10th exams postponed: పదో తరగతి పరీక్షలు తాత్కాలిక వాయిదా

కరోనా దృష్ట్యా పదోతరగతి పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలకు 15 రోజుల ముందు వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ న్యాయపోరాటానికి తెదేపా మద్దతు

చిత్తూరు కారాగారంలో ఉన్న జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందంటూ ఆయన కుమారుడు వంశీకృష్ణ చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతు తెలపాలని తెదేపా నిర్ణయించింది. జైలులో కత్తి లభ్యం ఘటనపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • దీదీ ఎత్తుగడ.. ముఖ్య సలహాదారుగా బంధోపాధ్యాయ్​

బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ ఇవాళ పదవీ విరమణ చేస్తారని తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆయన స్థానంలో హరే క్రిష్ణ ద్వివేదిని కొత్త సీఎస్​గా నియమించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 'కేంద్రం వైఫల్యంతో 97% మంది ప్రజలకు నష్టం!'

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మహమ్మారి సమయంలో ప్రభుత్వ వైఫల్యం వల్లనే 97 శాతం మంది ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. కేంద్రానిది జీరో వ్యాక్సిన్​ పాలసీ అని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • కుమారుడి మందుల కోసం సైకిల్​పై 300 కిమీ..

కుమారుడికి అవసరమైన ఔషధాలు తీసుకొచ్చేందుకు ఓ తండ్రి పెద్ద సాహసమే చేశాడు. లాక్​డౌన్​తో ఎలాంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల పాత సైకిల్​పై 300 కిమీ ప్రయాణించాడు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను అనుకున్నది సాధించాడు. ఈ సంఘటన కర్ణాటక మైసూర్​ జిల్లాలో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 550 మిలియన్ డాలర్లు ఇస్తేనే ఆ నౌక రిలీజ్!

సూయిజ్​ కాలువలో రాకపోకలకు ఎవర్​ గివెన్​ షిప్​ అంతరాయం కలిగించిన కారణంగా ఆ ఓడ యాజమాన్యం 550 మిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని ఈజిప్టు అధికారులు డిమాండ్​ చేశారు. షిప్​ యజమాని షోయ్​ కిసేన్ కైషా తమకు 150 మిలియన్​ డాలర్లు చెల్లిస్తానని తెలిపారని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Cricket: భారత్,ఇంగ్లాండ్​ జట్లకు ఆడిన ఒకే ఒక్క క్రికెటర్

ప్రపంచ క్రికెట్​లో అరుదైన ఘనత సాధించారు పటౌడీ నవాబు ఇఫ్తికర్ అలీఖాన్. భారత్, ఇంగ్లాండ్ జట్ల తరఫున టెస్టుల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Akira Nandan: పవన్​ తనయుడి పిక్​ వైరల్​!

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్(Pawan Kalyan)​ తనయుడు అకిరా నందన్​ ఫొటో వైరల్(Akira Nandan Viral)​గా మారింది. అందులో పవన్ కంటే ఎత్తుగా అకిరా కనిపించడం వల్ల అభిమానులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో అకిరాను త్వరలోనే వెండితెరపై చూడనున్నామని ఫ్యాన్స్​ భావిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.