ETV Bharat / briefs

లాసెట్ 2019 ఫలితాలు విడుదల - lawcet

ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం కోర్సుల అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు అమరావతిలో విడుదల చేశారు. లాసెట్ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన వెంకటశివారెడ్డి మొదటి ర్యాంకు సాధించారు.

లాసెట్ 2019 ఫలితాలు విడుదల
author img

By

Published : May 20, 2019, 1:03 PM IST

Updated : May 20, 2019, 1:21 PM IST

ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. అమరావతిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఫలితాలు విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి ర్యాంకు కార్డులను లాసెట్ వెబ్​సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. లాసెట్ ఫలితాల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు గాను కడప జిల్లాకు చెందిన వెంకటశివారెడ్డికి మొదటిర్యాంకు సాధించినట్లు విజయరాజు చెప్పారు. రెండో ర్యాంకు చిత్తూరు జిల్లారు ఆర్. జగదీశ్ పొందినట్లు తెలిపారు. అయిదేళ్ల ఎల్​ఎల్​బీలో మొదటి ర్యాంకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్. సూరజ్, రెండో ర్యాంకు కర్నూలుకు చెందిన కిరణ కుమార్ రెడ్డి కైవసం చేసుకున్నట్లు విజయరాజు ప్రకటించారు.

లాసెట్ 2019 ఫలితాలు విడుదల

ఎల్‌ఎల్‌బీలో దాదాపు 9 వేల సీట్లు ఉన్నాయని ఛైర్మన్ విజయరాజు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం అర్హత పరీక్ష లాసెట్‌కు 11,497 మంది విద్యార్థుల హాజరు కాగా 10,831 మంది అర్హత సాధించారని తెలిపారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 7,764 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 2,396 మంది, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 671 మంది ఉత్తీర్ణత పొందినట్లు వెల్లడించారు.

లాసెట్ పరీక్ష ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net ద్వారా తెలుసుకోవచ్చు.

Intro:Ap_cdp_47_20_daadi_gaayalu_Av_c7
కడప జిల్లా రాజంపేట పట్టణం రామనగర్ లో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ దాడిలో గాయపడిన జాకీర్, సాయి కృష్ణలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన బాధితుడు జాకీర్ మాట్లాడుతూ గతంలో లో మా ఇంటి ముందు అతివేగంగా ద్విచక్ర వాహనంలో వెళుతుండగా అభ్యంతరం చెప్పినందుకు ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివారం రాత్రి మసీదుకు వెళ్తుండగా మరోసారి దాడి చేసి తీవ్రంగా కొట్టారని, అడ్డువచ్చిన అమ్మ నాన్నను కూడా కొట్టారని చెప్పారు. ఈ దాడి సమయంలో నా పక్కన ఉన్న సాయి కృష్ణ అనే వ్యక్తి అడ్డు వచ్చినందుకు అతనిపై కూడా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా అభ్యర్థి బత్యాల చెంగల్రాయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

Body:ఘర్షణలో ఇరువురికి గాయాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : May 20, 2019, 1:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.