ETV Bharat / briefs

తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం: చంద్రబాబు - ట్వీట్స్

ఈ తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలమనీ... ఇక్కడి ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ తన శక్తినీ, ఉత్సాహాన్ని పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

చంద్రబాబునాయుడు
author img

By

Published : Apr 20, 2019, 12:58 PM IST

Updated : Apr 20, 2019, 3:03 PM IST

ఆంధ్రప్రదేశ్​ను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా చూడాలన్న తన లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన.. ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, మేధావులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

అంతిమంగా ధర్మానిదే విజయం
ధర్మపోరాట దీక్ష ప్రారంభించి నేటికి సంవత్సరం అయిందనీ.. 40 సంవత్సరాల ప్రజాజీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని స్పష్టంచేశారు. కొంత ఆలస్యమైనప్పటికీ అంతిమంగా ధర్మానిదే విజయమని తన అనుభవంలో నేర్చుకున్నానని తెలిపారు. మన రాష్ట్రానికీ, మన ప్రజలకూ న్యాయం జరిగి మళ్లీ ధర్మమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలమనీ... ఇక్కడి ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ తన శక్తినీ, ఉత్సాహాన్ని పెంచుతుందన్నారు.

  • ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

    — N Chandrababu Naidu (@ncbn) 20 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయింది. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాను. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని నా అనుభవంలో నేర్చుకున్నది.

  • మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా.

  • ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం.

ఇవీ చదవండి..

చంద్రబాబుకు ప్రముఖుల శుభాకాంక్షలు

Intro:Ap_cdp_46_19_chandrababu_janmadina_vedukalu_Av_c7
సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెదేపా నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా రాజంపేట తెదేపా కార్యాలయంలో శనివారం ఆ పార్టీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడు కేక్ కట్ చేశారు. రాజంపేట పట్టణం మండల ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరాగా వారి సమక్షంలో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకుపోవాలని ఆయన కోరారు పార్టీ నాయకులు డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం నాయుడు మల్లెల సుబ్బారాయుడు చమర్తి సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Body:ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Apr 20, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.