దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్యను జనవరి 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఏపీలో జనవరి 11 తర్వాత కొత్తగా 22లక్షల 48వేల 308మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ఐదేళ్లలో కొత్తగా 39లక్షల 86వేల 139మంది ఓటర్లు పెరిగారని ఈసీ తెలిపింది.
ఓట్ల గల్లంతు ప్రచారాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ధరించింది. జనవరి 11నాటికి రాష్ట్రంలో 3,69,33,091 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3,91,81,399కు చేరింది. మొత్తం ఓటర్లలో ఒక కోటి 93లక్షల 82వేల 068 మంది పురుషులు, ఒక కోటి 97లక్షల 95వేల 423 మంది మహిళలు, 3వేల 908 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు.
ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల 86 వేల 139 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని ఈసీ తెలిపింది. ఫారం-7 దుర్వినియోగమైందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. కేవలం లక్షా 41వేల 822 ఓట్లను మాత్రమే తొలిగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఓటువేసే వారి సంఖ్య 39 లక్షల 86 వేలు 139కు పెరిగిందని ఈసీ తెలిపింది.
ఓటర్ల సంఖ్య
2014 | 2019 | |
రాష్ట్రం | 3,51,95,260 | 3,91,81,399 |
పురుషులు | 1,74,58,240 | 1,93,82,068 |
మహిళలు | 1,77,33,676 | 1,97,95,423 |
ట్రాన్స్జెండర్ | 3,344 | 3,908 |
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య (లక్షల్లో)
జిల్లా | 2014 | 2019 |
శ్రీకాకుళం | 19,95,140 | 21,70,802 |
విజయనగరం | 16,78,497 | 18,17,635(అత్యల్పం) |
విశాఖపట్నం | 31,59,342 | 35,74,246 |
తూర్పుగోదావరి | 38,40,538 | 42,04,035(అత్యధికం) |
పశ్చిమగోదావరి | 30,57,922 | 32,06,496 |
కృష్ణా | 30,51,122 | 35,07,460 |
గుంటూరు | 35,96,455 | 39,62,143 |
ప్రకాశం | 24,08,706 | 26,28,449 |
నెల్లూరు | 21,13,436 | 23,82,114 |
కడప | 18,95,916 | 21,92,158 |
చిత్తూరు | 28,94,589 | 31,79,101 |
అనంతపురం | 29,24,040 | 32,14,438 |
కర్నూలు | 27,57,094 | 31,42,322 |
ఇవీ కూడా చూడండి