ETV Bharat / international

రష్యా 'కరోనా వ్యాక్సిన్​' విడుదల

author img

By

Published : Aug 11, 2020, 2:30 PM IST

Updated : Aug 11, 2020, 3:06 PM IST

President Vladimir Putin says Russia's coronavirus vaccine has been registered; his daughter is among those inoculated.
రష్యా 'కరోనా వ్యాక్సిన్​' విడుదల

14:52 August 11

రష్యా వ్యాక్సిన్​ వచ్చేసింది

యావత్​ ప్రపంచం ఎదురుచూస్తున్న శుభవార్తను రష్యా అందించింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ను రిజిస్టర్​ చేసినట్టు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. ఈ టీకా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. టీకాను పరీక్షించిన వారిలో తన కుమార్తె కూడా ఉన్నట్టు తెలిపిన పుతిన్​.. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

వ్యాక్సిన్​ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు పరీక్షల్లో తేలిందని పుతిన్​ పేర్కొన్నారు. కరోనా వైరస్​ నుంచి శాశ్వత రోగనిరోధక శక్తిని ఈ టీకా​ అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలకు విడుదల చేసేందుకు కావాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్​పై జరిపినట్టు పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు.  

పంపిణీలో భాగంగా తొలుత ఈ టీకాను ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వైరస్​ ప్రమాదం అధికంగా పొంచి ఉన్న వారికి అందివ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.

అయితే ఈ వ్యాక్సిన్​పై రష్యాలోని పలువురు శాస్త్రవేత్తలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ ట్రయల్స్​ జరగకముందే వ్యాక్సిన్​ను ఎలా రిజిస్ట్రర్​ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

14:28 August 11

రష్యా 'కరోనా వ్యాక్సిన్​' విడుదల

కరోనా వ్యాక్సిన్​ను విడుదల చేసినట్లు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. టీకాను పరీక్షించిన వారిలో ఆయన కుమార్తె కూడా ఉన్నట్లు తెలిపారు.  

Last Updated : Aug 11, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.