కరోనా ప్యాకేజ్ రౌండ్-3 హైలైట్స్
- రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు. శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డుల నిర్మాణంపై దృష్టి.
- మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కోసం రూ.10 వేల కోట్లతో కొత్త పథకం. ఈ చర్యతో ఆహార నాణ్యత మెరుగుదల, రిటైల్ మార్కెట్‌తో అనుసంధానం, ఆదాయంలో వృద్ధి.
- ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగానికి రూ.20 వేల కోట్లు. చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేలా మౌలిక వసతుల అభివృద్ధి.
- రూ.13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం అమలు. 53 కోట్ల పశువుల్లో గాళ్ల వ్యాధి(ఎఫ్ఎండీ) నివారణే లక్ష్యం.
- డెయిరీ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు రూ.15 వేల కోట్లతో పశు సంవర్థక మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు.
- ఔషధ విలువలు కలిగిన మొక్కల పెంపకం ప్రోత్సహించేందుకు రూ.4 వేల కోట్లు కేటాయింపు. రానున్న రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో సాగు చేయించడమే లక్ష్యం.
- తేనెటీగల పెంపకం ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు ఖర్చు. గ్రామాల్లోని 2 లక్షల మందికి లబ్ధి.
- అన్ని పళ్లు, కూరగాయలకు 'ఆపరేషన్ గ్రీన్స్' పథకం వర్తింపచేసేందుకు అదనంగా రూ.500 కోట్లు. రవాణా, నిల్వపై 50 శాతం రాయితీ.
- నిత్యావసరాల చట్ట సవరణకు కేంద్రం నిర్ణయం. చట్టం పరిధి నుంచి పప్పులు, ధాన్యాలు, వంట నూనెలు, ఉల్లి, ఆలూ తొలగింపు.
- రైతులు నచ్చిన చోట ఉత్పత్తులను అమ్ముకునేలా వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో సంస్కరణలు.
- పంట ఉత్పత్తుల నాణ్యత పెంచి, రైతులకు మెరుగైన ధర లభించేలా నూతన వ్యవస్థ అభివృద్ధి.