ETV Bharat / bharat

వైసీపీ దౌర్జన్యం.. టీడీపీ ఎమెల్యేలపై దాడి - Vellampally

YSRCP MLAs Attack : అధికార వైసీపీ ఎమ్మెల్యేలు మాపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మాపై స్పీకర్​ చర్యలు తీసుకుంటారు. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాపై ఇలా దాడి చేయటం ఎంటనీ వారు మండిపడ్డారు.

tdp mlas
tdp mlas
author img

By

Published : Mar 20, 2023, 10:31 AM IST

Updated : Mar 20, 2023, 2:20 PM IST

YSRCP MLAs Attack: శాసనసభలో మాపై వైసీపీ ఎమ్మెల్యేలు మాపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మేం తప్పు చేస్తే స్పీకర్‌ చర్య తీసుకుంటారని.. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయటం ఎంటనీ ప్రశ్నించారు. వైసీపీ శాసన సభ్యులు శాసనసభ పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌ వద్ద మేం నిరసన చేస్తుంటే వైసీపీ సభ్యులు రావటం ఎంటనీ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు దాడి చేశారని.. గోరంట్ల బుచ్చయ్యచౌదరిని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి తోసేశారని అన్నారు.

దాడి చేయటమే కాకుండా ఆరోపణలు : అధికార వైసీపీ ఎమ్మెల్యేలు మాపై దాడి చేయటమే కాకుండా.. తిరిగి మేమే దాడి చేశామని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వాళ్లు దాడి చేయటమే కాకుండా మేం దాడి చేశామని అంటున్నారని వాపోయారు. శాసన సభలో జరిగింది ఎంటో స్పీకర్​ తెలుసని అన్నారు. మేము తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండని స్పష్టం చేశారు. సభ దృశ్యాలు పరిశీలిస్తే ఎవరు తప్పు చేశారో అన్న విషయం బహిర్గతం అవుతుందన్నారు.

దాడి వివరాలు వెల్లడించిన టీడీపీ నేతలు : శాసనసభలో టీడీపీ నేతలు వైసీపీ సభ్యుల మధ్య తోపులాట జరిగిందని వారు వెల్లడించారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలియచేస్తున్న టీడీపీ సభ్యులపై మాజీమంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు తదితరుల మధ్య తోపులాట జరిగిందని అన్నారు. డోలా బాలవీరాంజనేయస్వామిపై సుధాకర్‌బాబు, ఎలీజా దాడిచేశారని టీడీపీ నేతలు వెల్లడించారు. వెల్లంపల్లి మా స్థానాల్లోకి వచ్చి బుచ్చయ్యచౌదరిపై దాడిచేశారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వటంతో.. పిచ్చి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. స్పీకర్ కూడా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారని తెలిపారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కొద్దిసేపు శాసనసభ వాయిదా వేశారని తెలిపారు. అంతే కాకుండా దాడి అనంతరం స్పీకర్ వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్​ చేశారని వివరించారు. వాళ్లు దాడిచేసి.. మేం దాడిచేసినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. వైసీపీకి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఏం జరిగిందో తెలియటానికి వీడియో మొత్తాన్ని బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. మా సభ్యులు దాడి చేసినట్లు వీడియోలో నిక్షిప్తమై ఉంటే చర్యలు తీసుకోండాని అన్నారు.

"మేము తప్పు చేస్తే స్పీకర్​ మాపై చర్యలు తీసుకుని సస్పెండ్​ చేయాలి. సభకు అటంకం కలిగిస్తే దానిపై చర్యకు స్పీకర్​కు హక్కు ఉంటుంది. కానీ, స్పీకర్ పోడియం పైకి వైసీపీ నాయకులు గుండల్లాగా వచ్చి దళిత శాసన సభ్యులు వీరంజనేయులు మీద సుధాకర్​ బాబు, ఎలిజాతో పాటు కొంత మంది నేతలు, దళిత శాసన సభ్యులు కలిసి తోసేశారు. కింద ఉన్న బుచ్చయ్య చౌదరిని ఎల్లంపల్లి తోసేశారు. ఈ వీడియోలు రికార్డాయ్యాయి." -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

వైసీపీ దౌర్జన్యం.. టీడీపీ ఎమెల్యేలపై దాడి

దాడిని ఖండించిన చంద్రబాబు : అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అసెంబ్లీ చరిత్రలోనే ఈ రోజు చీకటి రోజు అని దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలోనే సభలో ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రోద్భలంతోనే దళిత సభ్యుడు స్వామిపై దాడి చేశారని మండిపడ్డారు. చట్టసభకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా సీఎం జగన్ కచ్చితంగా నిలిచిపోతారని అన్నారు. వైసీపీ సిద్ధాంతమేంటో ప్రజలకు పూర్తిగా అర్థమైందని.. ఇది శాసనసభ కాదని, కౌరవ సభ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Shocked to see our MLA Dr. Dola Swamy being attacked in the assembly by YSRCP MLAs. Today is a Black day for Andhra Pradesh because such a shameful incident has never happened in the hallowed halls of the assembly before.(1/3)#TDPDalitMLAattackedInAssembly pic.twitter.com/LmWFkxVbVy

    — N Chandrababu Naidu (@ncbn) March 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దాడిపై మండిపడ్డ లోకేశ్​ : ద‌ళితుల‌పై వైసీపీ ద‌మ‌నకాండ అసెంబ్లీలోనూ కొన‌సాగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ద‌ళిత మేధావి, అజాత‌ శ‌త్రువు, కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై.. దాడి ప్రజాస్వామ్య వ్యవ‌స్థకే క‌ళంకమని మండిపడ్డారు. బ్రిటిష్ కాలంనాటి జీవో​ తీసుకువచ్చి ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో ప్రశ్నించటం.. ద‌ళిత ఎమ్మెల్యే చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఇదే పాపం అన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డోలాపై దాడి చేయించ‌డం ద్వారా త‌న ప్రయాణం నేరాల‌తోనే.. త‌న యుద్ధం ద‌ళితుల‌పైనే అని మ‌రోసారి ముఖ్యమంత్రి జ‌గ‌న్ రెడ్డి నిరూపించుకున్నారని లోకేశ్‌ విమర్శించారు. సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రిపై ప్రజాస్వామ్య దేవాల‌యం లాంటీ అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగ‌బ‌డ‌టం దారుణమని లోకేశ్‌ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య చ‌రిత్రలోనే ఇది బ్లాక్ డే అని ఎద్దేవా చేశారు. అధికారం కోసం సొంత బాబాయ్‌నే హత్య చేసినవాళ్లు బుచ్చయ్యని గౌర‌విస్తార‌ని అనుకోవ‌డం వృథా ప్రయాస‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌ర్రు కాల్చి వాత పెట్టినా ఫ్యాక్షన్ బుద్ధి మార‌లేదని లోకేశ్‌ విమర్శించారు.

  • ద‌ళితుల‌పై వైసీపీ ద‌మ‌నకాండ అసెంబ్లీలోనూ కొన‌సాగింది. ద‌ళిత మేధావి, అజాత‌శ‌త్రువు, కొండెపి ఎమ్మెల్యే డాక్ట‌ర్ బాల వీరాంజనేయ స్వామిపై దాడి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కే క‌ళంకం.బ్రిటీష్ కాలంనాటి జీవో1 తెచ్చి ప్ర‌జాస్వామ్యం గొంతు నొక్కొద్ద‌ని..(1/3)#TDPDalitMLAattackedInAssembly pic.twitter.com/o6xFrFACUM

    — Lokesh Nara (@naralokesh) March 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కి నిలువెత్తు సంత‌కంలా నిలిచే సీనియ‌ర్ ఎమ్మెల్యే @GORANTLA_BC పై ప్ర‌జాస్వామ్య దేవాల‌యం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగ‌బ‌డ‌టం దారుణం. బుచ్చ‌య్య తాత‌పై దాడి దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లోనే బ్లాక్ డే.ఏడుప‌దుల వ‌య‌స్సు దాటిన పెద్దాయ‌న‌ని చూస్తేనే..(1/2) pic.twitter.com/A2Evx3mJE2

ఇవీ చదవండి :

Last Updated : Mar 20, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.