ప్రేమికులు తరచుగా గొడపడడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ 20 ఏళ్ల యువకుడు వీడియో కాల్లో తన ప్రేయసితో గొడవపడుతూ.. తన మర్మాంగాన్నే బ్లేడ్‌తో కట్ చేసుకున్నాడు. ఓ విషయంలో వీరి మధ్య వాగ్వాదం జరగగా.. సహనం కోల్పోయిన ఆ యువకుడు చివరకు తనను తానే గాయపరచుని.. కదలలేని స్థితికి చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గుజరాత్లో వెలుగుచూసింది.
అసలేం జరిగిందంటే..?
బంగాల్లోని కుచ్‌బెహర్ ప్రాంతానికి చెందిన ప్రసన్నజీత్ బర్మన్ అనే యువకుడు ప్రస్తుతం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తన మామయ్య శపన్ బర్మన్తో కలిసి ఉంటున్నాడు. అక్కడే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం ప్రసన్నజీత్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ప్రసన్నజీత్ ప్రేయసితో తరచుగా వీడియో కాల్స్ మాట్లాడేవాడు. కొన్నిరోజుల క్రితం ప్రసన్నజీత్ తన ప్రేయసితో వీడియోగా మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల గొడవ తలెత్తింది. దీంతో ప్రసన్నజీత్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. వీడియోకాల్‌లో తన ప్రేయసి చూస్తుండగానే.. పక్కనే ఉన్న బ్లేడ్‌తో తన మర్మాంగంపై దాడి చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఇంటికి చేరుకున్న శపన్ రక్తపు మడుగులో పడి ఉన్న తన అల్లుడ్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే ప్రసన్నజీత్‌కు చికిత్స అందించారు. ప్రసన్నజీత్ తన ప్రేయసి మత్తులో పడి తనను తాను గాయపరచుకున్నట్లు అతని మామ వెల్లడించారు.
భార్యను చంపిన ఆర్మ్డ్ ఫోర్స్ కానిస్టేబుల్
ఛత్తీస్‌గఢ్‌లో ఓ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ కానిస్టేబుల్.. కట్టుకున్న భార్యనే హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని నదిలో విసిరేసి.. తన భార్య కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
సుర్గజా జిల్లాలోని మైన్పట్లోని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఛత్తీస్గడ్ ఆర్మడ్ ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆ కానిస్టేబుల్ మార్చి 2న తన భార్యను హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని మచ్లీ నదిలో పడేశాడు. ఆ తర్వాత నిందితుడు మార్చి 6న తన భార్య కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కానిస్టేబుల్ తీరుపై అనుమానం వచ్చి విచారించగా.. అసలు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తన భార్యను చంపడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని.. త్వరలోనే ఆ విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.