ETV Bharat / bharat

దుకాణాల్లో క్యూఆర్ కోడ్​లు మార్చి భారీ 'స్కాం'.. యువకుడు అరెస్ట్​ - క్యూఆర్​ కోడ్​ను మార్చిన హోంగార్డు

దేశంలో రోజురోజుకూ సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి వారి వద్ద నుంచి రూ.లక్షల్లో కాజేస్తున్నారు. అలాగే చేశాడు తమిళనాడుకు చెందిన ఓ యువకుడు. అదెలాగో.. ఎందుకు చేశాడో ఓ సారి తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 11, 2022, 8:16 PM IST

షాపుల యజమానులకు తెలియకుండా క్యూఆర్‌ కోడ్‌ మార్చి.. రూ.లక్షల్లో మోసాలకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తొరైపాక్కంలో జరిగింది. ఇదే ప్రాంతంలో ఆనంద్(39) అనే వ్యక్తి టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ దుకాణంలో అతను తన బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన పేటీఎం క్యూఆర్​ కోడ్ స్టిక్కర్​ను అతికించాడు. వినియోగదారులు పంపిన డబ్బులు ఆనంద్ ఖాతాకు కొద్దిరోజులుగా రావట్లేదు. దీంతో మోసం జరిగిందని గ్రహించిన ఆనంద్.. కన్నగి నగర్​ పోలీస్ స్టేషన్​లో ఆగస్టు 3న ఫిర్యాదు చేశాడు.

కన్నగి నగర్​ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విచారణలో బ్యాంక్ అధికారుల సహాయాన్ని సైతం తీసుకున్నారు. దీంతో పలు విషయాలు బయటపడ్డాయి. శ్రీధర్(21) అనే వ్యక్తి అకౌంట్​లోకి ఆనంద్​ ఖాతాలోకి జమ అవ్వాల్సిన డబ్బులు వెళ్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు నిందితుడు శ్రీధర్​ను అదుపులోకి తీసుకుని విచారించారు.

"నేను తిరువాన్మియూర్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నా. పోలీసు కానిస్టేబుల్​గా పనిచేస్తున్నానని వ్యాపారులను నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డును సిద్ధం చేసుకున్నా. వ్యాపారుల దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్​ను మార్చి.. నా క్యూఆర్ కోడ్​ను పెట్టి డబ్బులు సంపాదిస్తున్నా. గత 15 రోజుల్లో 7 షాపుల్లో క్యూఆర్​ కోడ్​లు మార్చాను. "

-శ్రీధర్, నిందితుడు

నిందితుడు శ్రీధర్ నుంచి భారత్ పే క్యూఆర్ కోడ్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్​ను ఆలందూరు కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించారు పోలీసులు.

ఇవీ చదవండి: 'నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నానా?'.. మోదీ ఆరోపణలపై సీఎం కౌంటర్​!

దర్జాగా పడుకొని ఫ్లైట్​లో సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.