ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 26- అక్టోబర్​ 2) - horoscope prediction this week

ఈ వారం (సెప్టెంబరు 26- అక్టోబర్​ 2) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

WEEKLY HOROSCOPES
ఈ వారం రాశిఫలం
author img

By

Published : Sep 26, 2021, 4:14 AM IST

ఈ వారం (సెప్టెంబరు 26- అక్టోబర్​ 2) రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ముఖ్యకార్యాల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో శుభఫలితం. వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగండి. మంచి భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణ ఇప్పుడు మొదలవుతుంది. వస్తు ప్రాప్తి ఉంది. ఏకాగ్రతకు భంగం కలిగించే వ్యక్తులున్నారు. దేనికీ వెనుకాడకండి. వారాంతంలో ఒకపని పూర్తి అవుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి, శ్రమ ఫలిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ప్రతి పనీ జాగ్రత్తగా మొదలుపెట్టండి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపార లాభం, ఆర్థికాభివృద్ధి సూచితం. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఫలితం సానుకూలం. స్వల్ప ఆటంకాలను పట్టించుకోకుండా బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. వివాదాలకు అవకాశముంది. ఆంజనేయస్వామిని దర్శించండి, కోరికలు నెరవేరతాయి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆర్థికంగా అనుకూల ఫలితముంటుంది. ఉద్యోగ పరంగా శ్రమ పెరుగుతుంది. అడుగడుగునా విఘ్నాలుంటాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. గందరగోళ పరిస్థితుల నుండి బయట పడాలి. బంధుమిత్రుల సహకారం అవసరం. వారం మధ్యలో ఒక పనిలో పురోగతి ఉంది. మితంగా ఖర్చు చేయాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. ఇప్పుడు చేసే పనులు విజయవంతమవుతాయి. దైవబలం కాపాడుతోంది. ఉద్యోగంలో సత్ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. ఎదురుచూస్తున్న పనిలో లాభముంటుంది. నూతన కార్యాలు ప్రారంభించే కాలమిది. భూగృహ వాహనాది శుభయోగాలుంటాయి, ఇష్టదైవాన్ని దర్శించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

అనుకూలమైన కాలం. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. అభివృద్ధిని సాధించే అవకాశముంది. సమాజంలో మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ప్రతి పనీ మనసు పెట్టి చేయండి. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారున్నారు. శాంతంగా మాట్లాడితే శత్రువులు మిత్రులవుతారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)

మంచి పనులు చేసి లాభపడతారు. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంటి వాతావరణం ప్రశాంతతనిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. అద్భుతమైన తెలివితేటలతో బంగారు భవిష్యత్తును ఏర్పరచుకుంటారు. సూర్యస్తుతి శుభప్రదం.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఆర్థికంగా అనుకూలం. ఉద్యోగరీత్యా జాగ్రత్తగా వ్యవహరించండి. కాలం సహకరించడం లేదు. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచండి. దగ్గరివారితో ప్రేమగా ఉండాలి. వ్యాపారం కొంతవరకూ అనుకూలం. కొందరు నిందలు మోపాలని ప్రయత్నిస్తారు. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహ ధ్యానం మేలుచేస్తుంది.

వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు ఉంటాయి. అంతా శుభమే జరుగుతుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి. స్వల్ప ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. వారం మధ్యలో ఒక మంచి జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. నూతన ప్రయత్నాలు విజయాన్నిస్తాయి. శివస్మరణ మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

సర్వోత్తమమైన శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన విజయం సొంతమవుతుంది. గొప్ప భవిష్యత్తుని నిర్మించుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల అండ లభిస్తుంది. స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. లక్ష్మీదేవిని దర్శించండి, జీవితం ప్రశాంతంగా సాగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

దైవబలం సదా రక్షిస్తుంది. ఉద్యోగంలో ఒడుదొడుకులున్నాయి. పెద్దలతో గౌరవంగా వ్యవహరించండి. ప్రణాళిక ప్రకారం పని మొదలుపెడితే మంచి ఫలితాన్ని సాధించవచ్చు. కావాలని ఇబ్బంది పెట్టేవారున్నారు. చాకచక్యంగా వ్యవహరించాలి. ముఖ్యకార్యాలను వాయిదా వేయటం మంచిది. వృథా శ్రమ, ఖర్చు ఉంటాయి. విష్ణుసహస్రనామం చదివితే మంచిది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆర్థికాంశాలు కొంతవరకూ బాగానే ఉంటాయి. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగపరంగా శ్రద్ధ అవసరం. విఘ్నాలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోవాలి. తోటివారి సలహాలు పని చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. వ్యాపారరీత్యా మిశ్రమ కాలం నడుస్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామిని స్మరించండి. మనోధైర్యం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మంచి భవిష్యత్తు ఉంది. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రశంసలు లభిస్తాయి. విఘ్నాలను అధిగమిస్తారు. శ్రేష్ఠమైన జీవితం ఏర్పడుతుంది. చంచలత్వం లేకుండా వ్యవహరించండి. కొందరు మీకు మంచి చేస్తారు. ఆనందంగా రోజులు గడుస్తాయి. తోటివారి సహకారం కార్యసిద్ధినిస్తుంది. శ్రీవిష్ణుస్మరణ శక్తినిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.