ETV Bharat / bharat

బ్లైండ్‌ ఫోల్డ్‌ సుడోకు.. ఔరా అనిపిస్తున్న నందికొట్కూరు యువకుడు.. నెల రోజుల వ్యవధిలో 5 రికార్డులు

YOUNG MAN SET RECORD IN BLIND FOLD SUDOKU: చదువే కాకుండా వ్యక్తిగతంగా ఉండే అభిరుచులను గుర్తించి తగిన ప్రోత్సాహిస్తే.. అవలీలగా అంతర్జాతీయ రికార్డులు కొల్లగొట్టవచ్చని నిరూపిస్తున్నాడు ఆ యువకుడు. వార్తాపత్రికల్లో వచ్చే పజిల్‌లపై చాలా తక్కువ మంది దృష్టి సారిస్తారు. అలా వాటిపై పట్టు సాధించి, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని వావ్‌.. అనిపిస్తున్నాడు నందికొట్కూరు యువకుడు. మరి ఆ యువకుడు సాధించిన ఘనత, తన ప్రస్థాన వివరాలేంటో చూద్దామా?

YOUNG MAN PLAYING BLIND SUDOKU
YOUNG MAN PLAYING BLIND SUDOKU
author img

By

Published : Mar 31, 2023, 12:38 PM IST

Updated : Mar 31, 2023, 1:02 PM IST

YOUNG MAN SET RECORD IN BLIND FOLD SUDOKU: వార్తాపత్రికల అనుబంధాల్లో వచ్చే పజిల్స్‌ పూర్తి చేయడం చిన్నప్పటి నుంచి అతనికి చాలా ఇష్టమైన పని. అలా దానిపై ఉన్న ఇష్టంతో క్రమంగా వాటి గురించి మరింత సాధన చేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్​​లో చోటు దక్కించుకున్నాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో 5 రికార్డులు బద్దలు కొట్టి ఔరా అనిపించాడు.

కళ్లకు గంతలు కట్టుకుని సుడోకు చేస్తున్న ఈ యువకుడి పేరు జశ్వంత్ సున్హిత్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం. తల్లిదండ్రులు.. రేణుకాదేవి, చంద్రమోహన్. పదో తరగతి వరకు సొంత ఊరిలోనే చదువుకున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే పజిల్స్, సుడోకూలు చేయటంపై దృష్టి సారించేవాడు.

"చిన్నప్పుడు మా అత్తయ్య రమాదేవి సుడోకు నేర్పించారు. గ్రాడ్యుయేషన్​ టైంలో న్యూస్​ పేపర్లు, మ్యాగజైన్​లో వచ్చే వాటిని కట్​ చేసి ఖాళీ సమయాల్లో చదివే వాడిని. అదే అలవాటు ప్రకారం ఓసారి సుడోకుని కట్​ చేసి క్లాస్​ రూంలో ట్రై చేశా. మా తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సహంతో ఇంతవరకూ రానిచ్చా"-జశ్వంత్ సున్హిత్

సహజంగా సుడుకోను చూస్తూ అందరూ పరిష్కరిస్తారు. కానీ, పూర్తి ఏకాగ్రతతో ఒకసారి చూసి కళ్లకు గంతలు కట్టుకుని పూర్తి చేయడం కష్టం. మనోడు మాత్రం అవలీలగా చేసేస్తున్నాడు. 6నిమిషాల 32 సెకన్లలో సుడోకును పూర్తి చేసి కర్ణాటక అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకున్నాడు.

"బ్లైండ్​ ఫోల్డ్​ సుడోకుని నేను 6నిమిషాల 32సెకన్స్​లో కంప్లీట్​ చేశా. ఇండిపెండెంట్ విట్​నెస్​ ,రాండమ్​ సుడోకు చూపిస్తారు. సుడోకులో 9 రోస్​, 9కాలమ్స్​ ఉంటాయి. వాటన్నంటిని నేను 6నిమిషాల 32సెకన్స్​లో పూర్తి చేయడం వల్ల అన్ని బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ వాళ్లు నన్న అప్రిషియేట్​ చేసి వరల్డ్​ రికార్డు హోల్డర్​గా గుర్తించారు. సుడోకు మాత్రమే కాకుండా బ్లైండ్​ ఫోల్డ్​ చెస్​ కూడా ఆడగలను"-జశ్వంత్ సున్హిత్

సుడోకు లోనే కాక చెస్, టెన్నిస్‌లోనూ రాణిస్తున్నారు సున్హిత్‌. తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు... లివర్‌లో 60% డొనేట్‌ చేశాడు. అలా 18 ఏళ్ల వయసులోనే అవయవ దానం చేసి.. తక్కువ వయసులో అవయవ దానం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అవయవదానం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

"నాకు అవయవదానం చేసి నన్ను బతికించాడు. 18 సంవత్సరాలు ఉన్నప్పుడు లివర్​ని దానం చేశాడు"-చంద్రమోహన్, జశ్వంత్ తండ్రి

ఈ రికార్డులు సాధించడానికి వ్యాపకాలే తోడ్పడ్డాయంటున్నాడు. తన ప్రయత్నం ప్రత్యేకించి రికార్డుల కోసం చేయలేదని, తనకు ఉండే వ్యాపకాలే తనను రికార్డు సాధించేంత సాధన చేయించాయంటున్నాడు. ఈ విజయానికి కారణం ఈనాడు సండే మ్యాగజైన్‌తో పాటు హిందూ న్యూస్‌ పేపర్‌ అంటున్నాడు. ఈ యువకుడు ఇన్ని ఘనతలు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఏదైనా అనుకుంటే సాధించే వరకు శ్రమించే తత్వం వల్లే ఈ రికార్డులు సాధ్యమయ్యాయని అంటోంది జశ్వంత్‌ తల్లి రేణుకా దేవి.

"మా అబ్బాయి ఈ ఘనత సాధించాడంటే చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం ఉంది. ఏదైనా చేయాలి అనుకుంటే కష్టపడి సాధించేవాడు" -రేణుకాదేవి, జశ్వంత్ తల్లి

చదువే కాక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఓ కళ ఉంటుంది. దానిని గుర్తించి, ప్రోత్సహించాలి. అలా చేస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఉన్నతస్థాయికి ఎదుగుతారు. అయితే తాను ఇక్కడితో ఆగి పోకుండా భవిష్యత్‌లో మరింత ఎదిగి, దేశసేవ చేయడమే కోరిక అంటున్నాడు జశ్వంత్‌ సున్హిత్.

బ్లైండ్‌ ఫోల్డ్‌ సుడోకు.. ఔరా అనిపిస్తున్న నందికొట్కూరు యువకుడు..

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.