కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా యశ్వర్ధన్‌కుమార్ సిన్హా శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ దౌత్యాధికారి, ప్రస్తుత సమాచార కమిషనర్ అయిన సిన్హా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.
పాత్రికేయుడు ఉదయ్ మహుర్కర్, కార్మికశాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమారియా, కాగ్ మాజీ అధికారి సరోజ్ పున్హానీలు... సిన్హాకు సహ కమిషనర్లుగా నియమితులయ్యారు. 62 ఏళ్ల సిన్హా.. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. కమిషనర్లుగా పై ముగ్గురి నియామకంతో దేశంలో సమాచార కమిషనర్ల సంఖ్య ఏడుకు చేరింది.