Wrong parking charges: పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వినూత్న ఆలోచనతో కేంద్రం ముందుకొస్తోంది. చేయకూడని చోట వాహనాన్ని పార్కింగ్ చేసి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించే వారికి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం ఫొటోను ఎవరైనా పంపినప్పుడు వారికి వెయ్యి రూపాయలు ఫైన్ పడితే.. పంపించిన వ్యక్తికి రూ.500 రివార్డు రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని కోసం ఓ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
" ఎవరైనా వ్యక్తి రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం చిత్రాన్ని పంపితే వారికి రివార్డ్ ఇస్తాం. జరిమానా రూ.1000 అయినప్పుడు.. రూ.500 వరకు రివార్డు అందివ్వాలని అనుకుంటున్నాం. ఇందుకోసం ఓ చట్టం తీసుకురానున్నాం. అప్పుడే పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుంది"
- నితిన్ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి.
పార్కింగ్ స్థలాల్లో కాకుండా రోడ్లపై కొందరు వ్యక్తులు తమ వాహనాలను పార్క్ చేస్తుండడం పట్ల అసహనం వ్యక్తంచేశారు. నాగ్‌పుర్‌లోని తన వంటవాడికి రెండు వాహనాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబానికి ఆరేసి వాహనాలు ఉంటున్నాయని చెప్పారు. ఈ విషయంలో దిల్లీ వాసులు అదృష్ట వంతులని.. పార్కింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా రహదారులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రూ.500 కొడితే 2500.. ఆ ఏటీఎంకు ఎగబడ్డ జనం!
130ఏళ్ల చెట్టుపై 'మెర్క్యూరీ' దాడి.. నలుగురు డాక్టర్ల స్పెషల్ ట్రీట్మెంట్తో...