ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్​తో యువతి పెళ్లి.. బంధువుల షాక్​ ట్రీట్మెంట్​.. హైకోర్టు జోక్యంతో.. - ట్రాన్స్​జెండర్​తో వివాహం

ట్రాన్స్​జెండర్​ను వివాహం చేసుకున్నందుకు ఓ యువతికి షాక్​ ట్రీట్మెంట్​ ఇచ్చి చిత్ర హింసలకు గురి చేశారు ఆమె బంధువులు. ఆమె భాగస్వామి హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

transman
ట్రాన్స్​జెండర్​
author img

By

Published : Jul 30, 2022, 6:37 PM IST

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఓ మహిళ, ట్రాన్స్​జెండర్​ జంట ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే వీరి బంధాన్ని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు వారి వద్దకు బలవంతంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. దీనిపై యువతి భాగస్వామి కోర్టును ఆశ్రయించగా వీరికి అనుకూలంగా తీర్చునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని దిండిగుల్​ జిల్లాకు చెందిన యువతి విరుధ్​నగర్​కు చెందిన ఓ ట్రాన్స్​జెండర్​ను ప్రేమించింది. వీరిద్దరూ ఈనెల 7న వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి తరఫు వారు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఈనెల 16న ఈ జంట ఉంటున్న ఇంటిలోకి వచ్చిన బంధువులు.. యువతి, ట్రాన్స్​జెండర్​పై దాడి చేశారు. అనంతరం యువతిని వారి ఇంటికి తీసుకెళ్లిపోయారు. యువతి బంధువులు ఆమె ఆలోచనను మార్చేందుకు షాక్​ ట్రీట్మెంట్​ ఇప్పించారని ఆమె భాగస్వామి ఆరోపించారు. 'మా బంధాన్ని అంగీకరించమని వారు అంటున్నారు. ఈ క్రమంలో ఆమె సోదరుడు తనను చిత్రహింసలు పెట్టాడు. నన్ను కూడా బెదిరించారు' అని ట్రాన్స్​జెండర్ పేర్కొన్నారు.

యువతి భాగస్వామి ఈ విషయంపై మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్​ పీఎన్​ ప్రకాశ్, ఆర్ హేమలత ధర్మాసనం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'పిటిషనర్​ గర్ల్​ఫ్రెండ్​కు 21 ఏళ్లు. ఆమె తన భాగస్వామితో కలిసి జీవించాలని అనుకుంటోంది. ఆ నిర్ణయానికి అడ్డుచెప్పలేము' అని హైకోర్టు పేర్కొంది.

ఇదీ చూడండి : కుమార్తెపై తల్లి కర్కశం.. చెప్పుతో చితకబాది.. నేలకేసి కొట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.