ETV Bharat / bharat

ఆన్​లైన్​లో సెక్స్​ చాట్​.. నెలకు రూ.10లక్షల ఆదాయం.. భర్తకు అడ్డంగా బుక్కైన మహిళ - యాప్​లో సెక్స్​ చాట్ చేస్తున్న మహిళ

ఓ యాప్​లో సెక్స్ చాట్​ చేస్తూ బాగా డబ్బులు సంపాదించేది ఓ మహిళ. అలా ఓ యువకుడికి అర్ధనగ్న కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యింది. ఆ యువకుడు మహిళ.. అర్ధనగ్న పొటోలను ఆమె భర్తకు పంపాడు. అప్పుడామె భర్త ఏం చేశాడంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 27, 2022, 10:46 PM IST

ఓ యాప్​లో ఆన్‌లైన్ సెక్స్‌చాట్ ద్వారా బాగా డబ్బు సంపాదించేది ఓ మహిళ. ఈ క్రమంలో ఓ యువకుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. అతడి కోరిక మేరకు అర్ధ నగ్నంగా వీడియో కాల్ చేసింది. యువకుడు స్కీన్​ రికార్డింగ్ ఆన్​లో ఉంచి.. మహిళ అర్ధనగ్న ఫొటోలను తీశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగింది.

ఫైజాబాద్​కు చెందిన ఓ వివాహిత యువకులతో ఓ యాప్​లో సెక్స్​ చాట్​ చేసేది. అలా ఓ యువకుడితో మాట్లాడుతూ అతడికి దగ్గరైంది. ఓ రోజు వీడియోకాల్​లో మహిళ అసభ్య ఫొటోలను తీశాడు. డబ్బులివ్వకపోతే ఈ ఫొటోలను భర్తకు పంపుతానని బ్లాక్​మెయిల్ చేశాడు. అందుకు మహిళ అంగీకరించకపోవడం వల్ల ఆమె ఫొటోలను భర్తకు పంపాడు. ఇదే అదునుగా చేసుకున్న ఆమె భర్త.. మహిళను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు లఖ్​నవూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం దరఖాస్తు చేసుకుంది.

కాగా, ఇలాంటి తరహా కేసు తొలిసారి చూస్తున్నానని సీనియర్ ఫ్యామిలీ కోర్టు అడ్వొకేట్ సిద్ధాంత్ కుమార్ తెలిపారు. సెక్స్ చాట్​ల ద్వారా మహిళ నెలకు రూ.80 వేల నుంచి రూ.10లక్షల వరకు సంపాదించేదని చెప్పారు. 'సోషల్ మీడియాలో తన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయని.. అందుకే తనకు డబ్బులు వస్తున్నాయని భర్తకు చెప్పేది. వీడియోలకు వచ్చే లైక్​ల ఆధారంగా తనకు ఓ యాప్ వాళ్లు డబ్బులు ఇస్తున్నారని బుకాయించింది' అని సిద్ధాంత్ కుమార్ వివరించారు.

'మహిళ బ్యాంక్ అకౌంట్​లో ఉన్న డబ్బును కాజేయాలని ఆమె భర్త ప్రయత్నించాడు. భార్య బ్యాంకు ఖాతాలన్నింటినీ బ్లాక్ చేశాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమెకు విడాకులు ఇచ్చేందుకు అతడు ఇష్టపడలేదు. దీంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది మహిళ. ఈ క్రమంలో మహిళకు కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చింది. డబ్బుల విషయంలో ఆశపడి తాను పెద్ద తప్పు చేశానని మహిళ స్వయంగా అంగీకరించింది' అని ఫ్యామిలీ కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధాంత్ కుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.