Whatsapp block suicide: బాయ్‌ఫ్రెండ్ తన నెంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడని మహారాష్ట్ర ముంబయి సమీపంలోని దహీసర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిన్న వాగ్వాదం కారణంగా యువకుడు ఆమెను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి.. రైల్వే ట్రాక్ పక్క ఉన్న యువకుడి ఇంటి వద్దే ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. మరణించిన ఆ యువతిని ప్రణాళి లోకడే(20)గా గుర్తించారు పోలీసులు. సోమవారం ఉదయం ఆమె చనిపోయిందని చెప్పారు.
"యువకుడి(27)తో మృతురాలికి ఆరేళ్లుగా పరిచయం ఉంది. గత ఆదివారం ఇద్దరు కలిసి ఓ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత యువకుడి ఇంటికి వెళ్లాలని ప్రణాళి పట్టుబట్టింది. అయితే, ఆ యువకుడు మాత్రం ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. ఇంటికి వెళ్లిపోవాలని సూచించాడు. ఆమె అలాగే వెళ్లిపోయింది. అయితే, పదేపదే ఫోన్ చేసి ఇంటికి వస్తానని యువకుడిని బతిమిలాడింది. రాత్రి అయింది కాబట్టి.. వద్దని చెప్పిన ఆ యువకుడు.. వాట్సాప్‌లో నెంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో అప్పుడే ఇంట్లో నుంచి బయల్దేరి యువకుడి వద్దకు వచ్చింది ప్రణాళి. రాత్రి అతడితోనే ఉంది. ఉదయం లేచి చూసేసరికి సీలింగ్‌కు దుపట్టాతో ఉరేసుకొని కనిపించింది" అని పోలీసులు వెల్లడించారు.
యువకుడు ఉదయం లేచి షాక్‌కు గురయ్యాడని పోలీసులు చెప్పుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: