బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. భవానీపుర్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేశారు. కోల్కతాలోని సర్వే బిల్డింగ్కు చేరుకున్న మమత.. నామపత్రాల సమర్పణ ప్రక్రియ పూర్తిచేశారు.
![West Bengal CM Mamata Banerjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13024027_mamata4.jpg)
![West Bengal CM Mamata Banerjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13024027_mamata2.jpg)
ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మమత అప్పుడు ఓడిపోయారు. అయినా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దీదీ.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
![West Bengal CM Mamata Banerjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13024027_mamata3.jpg)
ఈ నేపథ్యంలో భవానీపుర్ నుంచి ఎన్నికైన సోబన్దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయగా.. ఉపఎన్నిక నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మమతా బెనర్జీపై.. భాజపా తరఫున న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ పోటీపడనున్నారు. కాంగ్రెస్.. పోటీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది.
మమత ఓడినా.. తృణమూల్ జయభేరి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు.. టీఎంసీ 213 కైవసం చేసుకుంది. భాజపా 77 చోట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మమతా బెనర్జీ.. నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఇదీ చూడండి: దీదీపై పోటీకి భాజపా సై..