West Bengal CM vs Governor: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు నెలకొన్న నేపథ్యంలో బంగాల్ కేబినెట్ కీలక బిల్లును ప్రతిపాదించింది. బంగాల్లోని రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్గా గవర్నర్ స్థానంలో.. ముఖ్యమంత్రిని నియమించాలని ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు తెలిపారు. దీన్ని త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
"రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలన్నింటికీ ముఖ్యమంత్రిని ఛాన్స్లర్గా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ఇకపై ఛాన్స్లర్గా ఉంటారు. త్వరలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతాం."
-బ్రత్య బసు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్స్లర్గా ఉంటున్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ ఆమోదం లభిస్తే.. అమలులోకి వస్తుంది. ఆ తర్వాత యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. దీంతో యూనివర్సిటీలపై గవర్నర్ తన అధికారం కోల్పోనున్నారు.
ఇదీ చదవండి: