ETV Bharat / bharat

ఆజాద్ విగ్రహం నుంచి నీటి చుక్కలు.. భక్తితో నుదుటికి రాసుకుంటున్న ప్రజలు!

ప్రయాగ్​రాజ్​లోని పార్కులో ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం నుంచి నీటి చుక్కలు పడుతున్నాయి. ఈ నీటిని చూసిన ప్రజలు భక్తితో నుదుటికి రాసుకుని ఆజాద్ దీవెనలుగా స్వీకరిస్తున్నారు.

uttarpradesh Prayagraj Azad statue dripping water
ఆజాద్ కాంస్య విగ్రహం నుంచి నీటి చుక్కలు
author img

By

Published : Feb 12, 2023, 10:18 AM IST

Updated : Feb 12, 2023, 10:41 AM IST

ఆజాద్ కాంస్య విగ్రహం నుంచి నీటి చుక్కలు

ఉత్రర్​ప్రదేశ్ ప్రయాగ్​రాజ్​లోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ కాంస్య విగ్రహం నుంచి నీటి చుక్కలు ధారగా పడుతున్నాయి. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. అసలేం జరిగిందంటే?..
స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని.. ఆయన పేరు మీదే ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ పార్కులో ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజులుగా ఆ విగ్రహం నుంచి నీటి చుక్కలు కారుతున్నాయి. అది చూసి మొదటిసారి రజనీకాంత్ అనే వ్యక్తి కారుతున్న నీటిని శుభ్రం చేశాడు. అయితే మరుసటి రోజు కూడా నీరు కారటం చూసిన అతడు గార్డెన్స్ సూపరింటెండెంట్, జిల్లా మేజిస్ట్రేట్​కు ఫిర్యాదు చేశాడు. రజనీకాంత్​ నుంచి సమాచారం అందుకున్న అనంతరం విగ్రహానికి మరమ్మతులు ప్రారంభించారు.

అయితే విగ్రహం నుంచి నీటి చుక్కలు కారుతున్నాయన్న విషయం తెలుసుకున్న కొంతమంది.. దీన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనను భక్తితో ముడి పెడుతూ.. విగ్రహం నుంచి కారుతున్న నీటిని పవిత్రంగా భావిస్తున్నారు. ఆ నీటిని నుదిటిపై రాసుకుని అమరవీరుడి దీవెనలుగా అనుకుంటున్నారు. అయితే నిపుణులు మాత్రం దీనిని సాధారణ ప్రక్రియ అని అంటున్నారు. విగ్రహానికి ఎక్కడో పగుళ్లు ఏర్పడి ఉండవచ్చని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రామేంద్ర కుమార్ సింగ్ చెబుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కూడా విగ్రహానికి పగుళ్లు ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కారణం ఏదైనా గానీ ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో విగ్రహాలను సంరక్షించే సంస్థ ఐఎన్​టీఏసీహెచ్.. విగ్రహం నుంచి నీటి చుక్కలు రావడానికి గల శాస్త్రీయ కారణాలను తెలుసుకునే పనిలో ఉంది.

Last Updated : Feb 12, 2023, 10:41 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.