Vinayaka Chaviti 2023 Sep 18th or 19th Full Details ?: హిందూ పండుగల సీజన్ కొనసాగుతోంది. రాఖీ, కృష్ణ జన్మాష్టమి అయిపోగా.. ఇప్పుడు అత్యంత వైభవంగా జరుపుకునే గణపతి పండుగ(Vinayaka Chavithi Date) వచ్చేస్తోంది. ఈ ఉత్సవాల కోసం భక్తులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే.. వినాయక చవితిని ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో మాత్రం చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. మరి ఆ లంబోదరుడి పూజను ఎప్పుడు జరుపుకోవాలి..? విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్టించాలి..? ఆ శుభ ముహుర్తం ఎప్పుడు..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
'వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా.. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా'.. హిందువుల ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. నవరాత్రులూ (9 రోజుల పాటు) జరుపుకునే ఈ ఉత్సవాలను.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే.. గణపతి విగ్రహాల ఏర్పాటు కోసం యువత మండపాలను రెడీ చేస్తున్నారు.
తెలుగు వారి ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగిన మొదట పూజ ఆ విఘ్నేశ్వరుడుకే చెందుతుంది. తాము చేసే ఏ పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు కలుగకూడదని.. ఆ ఏకదంతుడికి పూజ చేస్తారు. ఎందుకంటే ఆయన విఘ్నాలకు అధిపతి కాబట్టి. అందుకే.. ఆ గణపతిని విఘ్నాధిపతి అని కూడా పిలుస్తారు. భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని పురాణోక్తి.
ఆ తిథి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? అనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కొంత మంది సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చతుర్థిగా చెబుతున్నారు. మరికొందరు సెప్టెంబర్ 19న జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఏ తేదీని అనుసరించాలి? అనే విషయంలో చాలా మంది తర్జనభర్జన పడుతున్నారు. దీనికి పంచాంగం ఏం చెబుతోందో చూద్దాం.
దృక్ పంచాంగం ప్రకారం.. వినాయక చవితి ముహూర్తం ఇదే :
According to Drik Panchagam: దృక్ పంచాంగం ప్రకారం.. వినాయక చవితి ముహూర్తం రెండు రోజుల్లోనూ విస్తరించి ఉందట. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 1.43 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగానే.. వినాయకచవితిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే.. మెజారిటీ నిర్ణయం మాత్రం 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 18వ తేదీనే పరిగణనలోనికి తీసుకుంది. వినాయక చవితి హాలీడేను 18నే ప్రకటించింది. భాగ్యనగర ఉత్సవ కమిటీ కూడా 18వ తేదీనే గణేష్ నవరాత్రులు మొదలుపెట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో కూడా 18వ తేదీ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.