ETV Bharat / bharat

మహిళను ఢీకొట్టిన వందేభారత్​ రైలు.. బాధితురాలు అక్కడికక్కడే మృతి - vande bharat express train crash

రైల్వే ట్రాక్​ను దాటుతున్న ఓ మహిళను వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది.

vande bharat express train hits woman
vande bharat express train hits woman
author img

By

Published : Nov 8, 2022, 8:00 PM IST

గుజరాత్​లోని ఆనంద్​ ప్రాంతంలో ఓ దుర్ఘటన జరిగింది. ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలు అహ్మదాబాద్​కు చెందిన బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్​గా గుర్తించారు.

మంగళవారం సాయంత్రం సుమారు 4.37 గంటల సమయంలో ట్రాక్ దాటుతుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతురాలు ఆనంద్‌లోని ఓ బంధువు వద్దకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్ నుంచి ముంబయి సెంట్రల్‌కు వెళ్తున్న రైలుకు ఆనంద్‌లో స్టాప్ లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

కాగా, వందేభారత్ ఎక్స్​ప్రెస్ రైలు ఇటీవల తరచూ ప్రమాదానికి గురవుతోంది. అక్టోబరు 6న ముంబయి నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు ముందు ప్యానెల్ దెబ్బతిన్నది. అది జరగిన మరుసటిరోజే ఆనంద్​ సమీపంలో ఓ ఆవును సైతం ఢీకొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులకు మరో రైలు.. పశువులను ఢీకొట్టింది.

ఇదీ చదవండి:ఇన్సూ​రెన్స్​ కంపెనీకి టోకరా.. రూ.1.60 కోట్లు కాజేసిన మహిళ!

ఎలుగుబంటి హల్​చల్.. ముగ్గురిపై దాడి.. మత్తుమందు ఇవ్వగానే భల్లూకం మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.