ETV Bharat / bharat

రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతున్న అంతర్జాతీయ షూటర్​ - దిల్​రాజ్​ కౌర్ న్యూస్

ఆమె భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఓ అంతర్జాతీయ షూటర్. 28 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు సాధించారు. కానీ, ఆర్థిక పరిస్థితులు ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. డబ్బులేక పరిస్థితి దయనీయంగా మారింది. చేసేదేమీలేక.. రోడ్డు పక్కన ఓ చిన్న కొట్టు నడుపుతూ వార్తల్లో నిలిచారామె. ఆమె ఎవరంటే...?

shooter, dilraj kaur
దిల్​రాజ్ కౌర్, ఉత్తరాఖండ్
author img

By

Published : Jun 23, 2021, 7:30 PM IST

Updated : Jun 23, 2021, 8:13 PM IST

ఉత్తరాఖండ్​ తొలి అంతర్జాతీయ పారా షూటర్ దిల్​రాజ్​ కౌర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో.. డబ్బు సంపాదించేందుకు వేరే మార్గం లేక.. రోడ్డు పక్కనే ఓ దుకాణం ఏర్పాటు చేసి సరుకులు అమ్ముతున్నారు. దెహ్రాదూన్​ గాంధీ పార్క్​ వద్ద చిప్స్​ అమ్ముతూ వార్తల్లో నిలిచారు.

dilraj kaur
సరుకులు అమ్ముతున్న షూటర్

ఒక్కరిదే కాదు..

ఈ సమస్య ఒక్క ప్లేయర్​ది మాత్రమే కాదని, రాష్ట్రంలో చాలా మంది ఆటగాళ్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి గణేష్ జోషి కుమార్తె నేహా జోషి అన్నారు. దిల్​రాజ్​కౌర్ ను కలిసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్​ పాలసీ వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

dilraj kaur
రోడ్డు పక్కనే దుకాణం పెట్టిన అథ్లెట్

"రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్లేయర్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఆటగాళ్ల బాగోగుల కోసం అన్ని ఏర్పాట్లు సకాలంలో జరుగుతుంటాయి. ఓ ప్లేయర్​.. దేశం కోసం ఆడినప్పుడు అందరూ గర్వంగా భావిస్తారు. కానీ, కొన్ని రోజులు ముగిశాక ఓ ఆటగాడిని ఎవ్వరూ గుర్తించుకోని పరిస్థితి ఏర్పడుతోంది."

--దిల్​రాజ్ కౌర్, షూటర్.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ఆటగాళ్లందరికీ సాయం చేయాలని, వారిని ఆదుకోవాలని దిల్​రాజ్ కౌర్​ డిమాండ్ చేశారు.

dilraj kaur
దిల్​రాజ్​ కౌర్

దిల్​రాజ్ ఇప్పటివరకు 24 బంగారు పతకాలు, 8 వెండి, 3 కాంస్య పతకాలు గెలిచారు. ఉత్తరాఖండ్​ స్టేట్​ షూటింగ్​ పోటీల్లో నాలుగు సార్లు బంగారు పతకం గెలిచినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఓ వెండి పతకం సాధించారు.

ఈ నేపథ్యంలో ఆమెను త్వరలోనే కలవనున్నట్లు క్రీడా శాఖ మంత్రి అర్వింద్ పాండే తెలిపారు.

ఇదీ చదవండి:'గోల్డెన్​ బాబా' బంగారు మాస్క్​- ధరెంతంటే..?

Last Updated : Jun 23, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.