ETV Bharat / bharat

రెండు డబుల్​ డెక్కర్​ బస్సులు ఢీ- 8 మంది మృతి - up bus accident news

ఎక్స్​ప్రెస్​ వేపై ఆగి ఉన్న డబుల్​ డెక్కర్​ బస్సును మరో డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 8 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీలో పూర్వంచల్​ ఎక్స్​ప్రెస్​ వేపై జరిగిందీ దుర్ఘటన.

up road accident today
రెండు డబుల్​ డెక్కర్​ బస్సులు ఢీ
author img

By

Published : Jul 25, 2022, 9:56 AM IST

Updated : Jul 25, 2022, 10:17 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. బారాబంకీ జిల్లాలో పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేపై ఈ దుర్ఘటన జరిగింది.
సోమవారం ఉదయం నరేంద్రపుర్​ మద్రాహ గ్రామానికి సమీపంలో ఎక్స్​ప్రెస్​ వేపై ఓ డబుల్​ డెక్కర్​ బస్సు ఆగి ఉంది. అదే సమయంలో బిహార్​లోని సీతామఢీ నుంచి దిల్లీ వెళ్తున్న మరో డబుల్​ డెక్కర్​ బస్సు.. వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని లఖ్​నవూలోని ట్రామా కేంద్రానికి తరలిస్తున్నట్లు బారాబంకీ అదనపు ఎస్​పీ మనోజ్​ పాండే వెల్లడించారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

జమ్ముకశ్మీర్​లో ఆరుగురు
జమ్ముకశ్మీర్​ రాంబాన్​ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ శ్రీనగర్​లోని ఆస్పత్రిలో సోమవారం ప్రాణాలు విడిచారు.
రాంబాన్​ జిల్లా రామ్సూ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న ఎస్​యూవీ.. అదుపు తప్పి 1000 అడుగుల లోయలో పడిపోయింది. నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ మరో నలుగుర్ని ఆస్పత్రిలో చేర్చగా.. సోమవారం ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Last Updated : Jul 25, 2022, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.