ETV Bharat / bharat

గోరఖ్​పుర్​లో యోగిపై 'భీమ్​ ఆర్మీ' ఆజాద్ పోటీ - గోరఖ్​పుర్​ అసెంబ్లీ ఎన్నిక

UP assembly polls 2022:యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్​పై పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు భీమ్ ఆర్మీ చీఫ్​ చంద్రశేఖర్ ఆజాద్​. ఈమేరకు ఆయన పార్టీ ఎఎస్​పీ(కే) సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.

Chandra Shekhar Aazad to fight UP poll from Gorakhpur Sadar against Adityanath
గోరఖ్​పుర్​లో యోగి ఆదిత్యనాథ్​పై చంద్రశేఖర్ ఆజాద్ పోటీ
author img

By

Published : Jan 20, 2022, 4:45 PM IST

UP assembly polls 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్​పుర్​ నియోజకం వర్గం నుంచి బరిలోకి దిగుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్​పై పోటీ చేయనున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్​, అజాద్​ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. బాబాసాహెబ్​ డా.భీమ్​రావ్ అంబేడ్కర్​, కాన్షీరాం సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పార్టీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. పార్టీ పేరు ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరాం)గా రిజిస్టర్ అయినట్లు వెల్లడించింది.

గోరఖ్​పుర్​ సదర్​ స్థానానికి ఆరో విడతలో భాగంగా మార్చి 3న ఎన్నిక జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

న్యాయవాది అయిన 35 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్​.. దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీని స్థాపించి వార్తల్లో నిలిచారు. ఎఎస్​పీ(కే) పార్టీని 2020 మార్చిలో ప్రారంభించారు. ఆయనే దానికి అధ్యక్షుడు.

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలని అఖిలేశ్ యాదవ్​తో సంప్రదింపులు కూడా జరిపారు ఆజాద్. అయితే రెండు సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పడం వల్ల పొత్తు కోసం ఆ పార్టీని మళ్లీ కలవబోమని ప్రకటించారు. ఎంచుకున్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వీలైతే ఇతర పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతామని చెప్పారు. భాజపా, ఆర్​ఎస్​ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడటమే తన లక్ష్యమని ఆజాద్​ పదే పదే చెబుతుంటారు.

కాంగ్రెస్ రెండో జాబితా..

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. ఇందులో 41మంది పేర్లున్నాయి. వీరిలో 16 మంది మహిళలు. సియానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పూనమ్​ పండిత్​కు అవకాశమిచ్చింది పార్టీ. అంతర్జాతీయ షూటర్​ అయిన ఈమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులకు మద్దతు తెలిపి వార్తల్లో నిలిచారు.

అలాగే ఆగ్రా కంటోన్మెంట్​(ఎస్సీ) నుంచి అఖిల భారత వాల్మీకీ మహాసభ జిల్లా అధ్యక్షుడు సికందర్ వాల్మీకీకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్​.

ఇచ్చిన మాట ప్రకారమే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40శాతం మహిళలకు సీట్లు కేటాయిస్తోంది హస్తం పార్టీ. తొలి జాబితాలో 125 మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడు అందులో 50 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు రెండు జాబితాలు విడుదల చేసి మొత్తం 166మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

బీఎస్పీలోకి 'నిర్భయ' లాయర్..

nirbhaya lawyer joined bsp
బీఎస్పీలోకి నిర్భయ లాయర్

2012 దిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన కేసును వాదించిన న్యాయవాది సీమ కుశ్వాహా బహుజన్ సమాజ్​ పార్టీలో(బీఎస్పీ) చేరారు. లఖ్​నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు.

nirbhaya lawyer joined bsp
బీఎస్పీలోకి నిర్భయ లాయర్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: సొంత ఇలాఖా నుంచే యోగి పోటీ- అఖిలేశ్​ సెటైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.