కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు.
తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్, అతని భార్య లైలా ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరికి మహ్మద్ షఫీ అనే మరో వ్యక్తి తోడయ్యాడు. మహ్మద్ షఫీ.. సోషల్ మీడియాలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26న ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను పద్మం (52), రోస్లి(50)గా గుర్తించారు.
తల్లి ఎదుటే గ్యాంగ్ రేప్..
ఝూర్ఖండ్ దేవ్‌గఢ్‌లో దారుణం జరిగింది. మైనర్‌పై ఆమె తల్లి ఎదుటే ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై బాధితురాలి తల్లి ఎదురుతిరగడం వల్ల ఆమెను తీవ్రంగా కొట్టారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది.. బాధితురాలు స్వస్థలం దుమ్కా జిల్లా తీన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామం. అయితే బాధితురాలు, ఆమె తల్లి కలిసి ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు దేవ్‌గఢ్‌కు వచ్చారు. అనంతరం ఆదివారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా.. రెండు బైక్‌లపై ఐదుగురు వ్యక్తులు వచ్చి వీరిద్దర్ని అడవిలోకి లాక్కెళ్లారు. బాలికను ఎత్తుకెళ్లి తల్లి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న మొబైల్, రూ.5వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఆమె తల్లితో కలిసి వెళ్లి మధుపుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
పాదంలో మేకు దిగ్గొట్టి..
డబ్బుల కోసం చిన్నారులు గొడవపడిన ఘటన విషయంలో ఓ యువకుడి పాదంలో మేకు దిగ్గొట్టిన పాశవిక చర్య ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. గఢవా జిల్లా కేంద్రంలో మేరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈద్గా తోలాలో ఇటీవల కొందరు పిల్లలు డబ్బుల విషయమై ఘర్షణపడ్డారు. ఈ ఘటన అనంతరం మూడు రోజులకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిళ్లపై వచ్చి నేనువ మోర్ వద్ద బస్రుద్దీన్ అనే యువకుడిని అపహరించుకుపోయారు.
హతమార్చే ఉద్దేశంతో అతడి పాదంపై మేకు దిగ్గొట్టారు. భరించలేని బాధతో విలవిల్లాడిన యువకుడు స్పృహతప్పి పడిపోవడంతో దుండగులు అతడిని ఎవరూ సంచరించని ప్రాంతంలో పడేశారు. చాలా సేపటి తరువాత తెలివిలోకి వచ్చిన అతడు విషయాన్ని ఫోనులో కుటుంబసభ్యులకు వివరించాడు. స్థానికులు అతన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవీ చదవండి: బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న పాఠశాల విద్యార్థుల వీడియో వైరల్
తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. ప్రతిపాదించిన ప్రధాన న్యాయమూర్తి