ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మట్టుబెట్టింది. పంజాబ్లోని తర్న్ తరణ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఘటన జరిగిందని ఓ అధికారి శనివారం తెలిపారు.
శుక్రవారం రాత్రి 8.48 గంటలకు సరిహద్దు వెంబడి అనుమానిత వ్యక్తుల కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించారని సదరు అధికారి తెలిపారు. వారిని ఆగాలని పదేపదే హెచ్చరించినప్పటికీ.. వినిపించుకోలేదని చెప్పారు. దాంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు వాటిల్లకుండా ఉండేందుకు వారిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే.... వారు ఉగ్రవాదులా కాదా అన్న విషయాన్ని సైన్యం వెల్లడించలేదు.
ఇదీ చూడండి: చల్లారని సరిహద్దు రగడ- ఎంపీ కోసం గాలింపు
ఇదీ చూడండి: భారత్-చైనా మధ్య 12వ విడత చర్చలు- సంధి కుదిరేనా?