ETV Bharat / bharat

మనవరాలిపై వృద్ధుడి రేప్.. సవతి కూతురిని ఎస్సై లైంగికంగా.. - nagpur latest news

Nagpur minor rape: సొంత మనమరాలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాత. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 12 ఏళ్ల మైనర్​పై అఘాయిత్యం చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనలు మహారాష్డ్రలో జరిగాయి.

Nagpur minor rape
మైనర్​పై రేప్
author img

By

Published : Jun 7, 2022, 2:28 PM IST

Nagpur minor rape: 13 ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు 62 ఏళ్ల వృద్ధుడు. నిందితుడు.. బాధితురాలికి స్వయానా తాత. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లోని కపిల్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. నిందితుడి కూతురు ప్రసవం కోసం అతడి ఇంటికి వచ్చింది. ఆమె కుమార్తె 13 ఏళ్ల బాలిక సైతం తల్లితో పాటు ఉంటోంది. బాధితురాలు తన తాత వద్ద నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కుటుంబ సభ్యులు.. బాధితురాలి తల్లికి ఈ విషయం బయటకు తెలియనివ్వొద్దని హెచ్చరించారు. తన తండ్రి చేసిన తప్పును ఎవరికీ చెప్పొద్దని బాధితురాలి తల్లితో వారించారు. మొదట్లో భయపడిన ఆమె.. ఆ తరువాత కపిల్ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

మాయమాటలు చెప్పి: మరోవైపు, 12 ఏళ్ల మైనర్​పై 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జరీపట్కా పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. నిందితుడు నీలేశ్​ లింబడే.. బాధితురాలి ఇంటి పక్కనే ఉంటున్నాడు. మైనర్​తో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. ఎవరూ లేని సమయంలో బాధితురాలిని తన ఇంటికి ఆహ్వానించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జరిగిన విషయమంతా బాధితురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పగా.. కుటుంబ సభ్యులు జరీపట్కా పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. నీలేశ్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కుమారుని కుటుంబం పైనే పెట్రోల్ పోసి: కుమారుడి కుటుంబంపైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు గ్రామస్థులు. ఈ ఘటనపై తాజ్​గంజ్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కన్హయ్య ఆగ్రా సమీపంలోని తోరా గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు మద్యం సేవించి.. కుమారుడు సందీప్, కోడలు అర్చనతో గొడవలు పడేవాడు. ఆదివారం రాత్రి కూడా బాగా తాగి కోడలితో గొడవకు దిగాడు. అనంతరం కన్హయ్య తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని డాబా మీద పడుకోమన్నాడు.

సందీప్​ కుటుంబం నిద్రపోతుండగా.. పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. ఈ మంటల్లో సందీప్ ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పొరుగున నివసిస్తున్న కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేశారు. క్షతగాత్రుల్ని శాంతి మంగ్లిక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల జైపుర్ హయ్యర్ సెంటర్​కు తరలించాలని వైద్యులు సూచించారు. నిందితుడు కన్నయ్య ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.

సవతి కుమార్తెపై: 13 ఏళ్ల సవతి కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. నిందితుడిపై అతని రెండో భార్య ఫిర్యాదు మేరకు.. పోక్సో చట్టం కింద జె.సి. నగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు తనను అసహజ లైంగిక చర్యలో పాల్గొనాలని ఇబ్బంది పెడుతున్నాడని అతని రెండో భార్య ఫిర్యాదు చేసింది.

తొలి వివాహంలో తలెత్తిన గొడవలు.. వీరిద్దరి పరిచయానికి బాటలు పరిచాయి. మొదటి భార్య తనపై చేసిన ఫిర్యాదుపై స్టేట్​మెంట్ ఇచ్చేందుకు సబ్​ఇన్​స్పెక్టర్.. ఓ మహిళా పోలీస్ స్టేషన్​కు రాగా... తన మొదటి భర్తపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు అదే పోలీస్ స్టేషన్​కు వెళ్లింది. అక్కడ మొదలైన వీరిద్దరి స్నేహం.. ప్రేమగా మారింది. అనంతరం ఇరువురూ తమ తొలి భాగస్వాములకు విడాకులు ఇచ్చి.. వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో ప్రస్తుతం వివాదాలు తలెత్తాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.