సరిహద్ద భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది మధ్యలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన త్రిపుర గోమతి జిల్లాలోని సిలాచారి ప్రాంతం ఇండో-బంగ్లా సరిహద్దు వద్ద జరిగింది.
ఇదీ జరిగింది..
సరిహద్దు గస్తీలో ఉన్న 20వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రతాప్ సింగ్, హవీల్దార్ సత్బీర్ సింగ్ మధ్య గురువారం సాయంత్రం వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన ప్రతాప్.. సత్బీర్పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ తర్వాత క్యాంపునకు తిరిగివచ్చిన ప్రతాప్.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతడి అనూహ్య చర్యతో కంగుతిన్న పై అధికారి రామ్‌కుమార్ సింగ్.. మాటలతో సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆయనకు బుల్లెట్లతో బదులు చెప్పాడు ప్రతాప్.
ఈ ఘటనతో భయపడిపోయిన ఇతర సిబ్బంది తమపైకి కూడా కాల్పులకు తెగబడతాడనే భయంతో ప్రతాప్‌ను కాల్చి చంపేశారు. రామ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఉన్నత అధికారులు మృతదేహాలను శవపరీక్షకు తరలించారు.
ఇదీ చూడండి: డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇక ఆ ఆయుధాలు!