ETV Bharat / bharat

తర్వాత రోజే పెళ్లి.. సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడ్డ వధువు.. దూకేసిన వరుడు.. చివరకు.. - kerala to be married couple fell

వారిద్దరికీ ఇటీవలే పెళ్లి ఫిక్సయింది. వివాహ వేడుకల్లో భాగంగా వధూవరులిద్దరూ తమ కుటుంబాలతో కలిసి ఆలయ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత సమీపంలో క్వారీని చూసేందుకు వెళ్లి.. సెల్ఫీ తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే వధువు కాలుజారి లోయలో పడిపోయింది. వరుడు కూడా ఆమెను కాపాడడానికి దూకేశాడు. చివరకు ఏమైందంటే?

To be married couple falls into a 120 feet deep granite quarry while taking selfie

author img

By

Published : Dec 9, 2022, 7:48 PM IST

సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడ్డ వధువు.. దూకేసిన వరుడు.. చివరకు..

కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు వాయిదా పడ్డాయి. దీనికి కారణం ఒక్క సెల్ఫీ!
ఏం జరిగిందంటే?
జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్​కు.. కల్లవుతుక్కల్​ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్​.కుమార్​కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. డిసెంబర్​ 9న ఘనంగా వివాహాన్ని జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో గురువారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు.

ఆ తర్వాత అక్కడ దగ్గర్లో ఉన్న క్వారీని చూడడానికి అందరూ వెళ్లారు. అదే సమయంలో విని కృష్ణన్​, శాండ్ర క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ స్టిల్​ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే కాలుజారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ లోయలో పడిపోయింది శాండ్ర. వెంటనే వరుడు కూడా ఆమె కాపాడడానికి దూకేశాడు.

అప్పటికే నీటిలో మునిగిపోతున్న శాండ్రను విని కృష్ణన్​ కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్వారీపై నుంచి తాడు వేసి ఇద్దరినీ గట్టిగా పట్టుకోమన్నారు.

అనంతరం పారిపల్లి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఒక చిన్న పడవను.. తాడు సహాయంతో లోయలోకి వేశారు. ఆ తర్వాత శాండ్రను విని కృష్ణన్​ పడవ మీద కూర్చోబెట్టాడు. విని కృష్ణన్ ఆ పడవను​ తోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. స్వల్పంగా గాయపడిన వీరిద్దరినీ కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.