ETV Bharat / bharat

'కాంగ్రెస్​ను వీడటమే ఫైనల్​'- రాజీ వార్తలపై కెప్టెన్​ - punjab congress news

కాంగ్రెస్​ను వీడిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Amarinder Singh News).. మళ్లీ ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. కాంగ్రెస్​తో సయోధ్యకు సమయం ముగిసిపోయిందని చెప్పారు. తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.

Amarinder singh
అమరీందర్ సింగ్​
author img

By

Published : Oct 30, 2021, 8:51 PM IST

కాంగ్రెస్​తో ​రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వస్తున్న వార్తలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Amarinder Singh News) శుక్రవారం ఖండించారు. ఆ పార్టీతో సయోధ్యకు సమయం ముగిసిపోయిందని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. కాంగ్రెస్​ను వీడాలని తాను తీసుకున్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. త్వరలోనే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని పునరుద్ఘాటించారు.

"కాంగ్రెస్​తో తెరవెనుక చర్చలు జరుపుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ పార్టీతో సయోధ్యకు సమయం ముగిసిపోయింది. చాలా ఆలోచించిన తర్వాతే కాంగ్రెస్​ను వీడాలని నిశ్చయించుకున్నాను. అదే ఇక చివరిది. నాకు మద్దతు అందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ, ఇప్పుడు కాంగ్రెస్​లో మాత్రం ఉండను."

-అమరీందర్ సింగ్​, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

తనను పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు... చర్చల జరుపుతున్నారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలపై అమరీందర్​(Amarinder Singh News) ఈ మేరకు స్పందించారు.

"నేను త్వరలోనే నా సొంత పార్టీని ఏర్పాటు చేస్తాను. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై భాజపా, అకాలీ చీలిక వర్గాలు సహా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతాను. పంజాబ్​ ప్రజలు, రైతుల కోసం ఓ బలమైన సామూహిక శక్తిని నిర్మించాలనుకుంటున్నాను."

కాంగ్రెస్ నేతలు చాలా మంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎన్నికల సంఘం(ఈసీ) ఆమోదం తెలపాకే కొత్త పార్టీ పేరు(Amarinder Singh New Party Name), గుర్తు ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ బుధవారం తెలిపారు. పంజాబ్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నా: అమరీందర్​ సింగ్​

ఇదీ చూడండి: 'కాంగ్రెస్ హామీలన్నీ నా హయాంలోనే పూర్తి చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.