ETV Bharat / bharat

300 మంది అనాథలకు అంత్యక్రియలు.. తోడులేని వారికి నీడ.. ఈ ఆదర్శ జంటకు సలామ్! - tn Voluntary couple burying orphans dead bodies

తమిళనాడులోని ఓ జంట అనాథల పాలిట ఆపద్బాంధవులుగా మారారు. నిస్సహాయ అనాథలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా.. కుటుంబాల తోడులేనివారెవరైనా మరణిస్తే సంప్రదాయబద్ధంగా వారి దహన సంస్కారాలు సైతం నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Voluntary couple burying orphans dead bodies

author img

By

Published : Nov 8, 2022, 8:46 PM IST

గొప్ప పనులు చేయలేకపోయినా పర్లేదు కానీ చిన్న పనులను ప్రేమతో చేయాలన్న మదర్ థెరిసా మాటలను ఆదర్శంగా తీసుకున్న తమిళనాడు జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. 'అన్బు జ్యోతి' అనే ఆశ్రమాన్ని స్థాపించిన ఈ జంట.. 17 ఏళ్ల నుంచి దాదాపు 300 మందికి పైగా నిస్సహాయ అనాథ మృతదేహాలకు దహన సంస్కరాలు నిర్వహించింది.

An inspiring couple who were burying the orphans
.

విల్లుపురంలోని గుండాలపులియూర్ గ్రామానికి చెందిన జువిన్, మారియా దంపతులు.. 2004 నుంచి ఈ పనిని చేస్తున్నట్లు తెలిపారు. వారు స్థాపించిన ఆశ్రమంలో నిరాశ్రయులకు చోటు కల్పించి వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా, ఎవరైనా మృతి చెందితే వారి అంతిమసంస్కరాలు సైతం దగ్గరుండి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినవారెవరూ లేని వీరికి అన్నీ తామై సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా తమిళనాడు, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో నిస్సహాయంగా తిరుగుతున్న మానసిక వికలాంగులను గుర్తించి వారికి సరైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.

మరోవైపు, పని చేస్తూ తమ కాళ్లపై నిలబడాలని అనుకునేవారికి ఆశ్రమంలో తగిన ఉపాధి కల్పించడం సహా పునరావాస ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వీరి కృషిని విల్లుపురం జిల్లా ప్రజలు ఎంతో అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ జంట.. ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురు చూస్తోంది. అనాథలను పూడ్చేందుకు స్థలం లేకపోవడం వల్ల వారి కోసం ప్రభుత్వం స్థలం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జువిన్, మారియా దంపతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఓట్ల వేటలో కొలువుల వల.. నిరుద్యోగుల వైపే పార్టీల చూపు!

ఎలుగుబంటి హల్​చల్.. ముగ్గురిపై దాడి.. మత్తుమందు ఇవ్వగానే భల్లూకం మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.