ETV Bharat / bharat

మేడపై నుంచి పడి.. రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి! - ఒడిశా వార్తలు

మేడపై ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఇరుకైన సందులో పడిపోయింది. ఆరు అంగుళాల స్థలం ఉన్న రెండు గోడల మధ్య బాలిక ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బాలికను కాపాడారు.

odisha cuttack news
దాబా పైనుంచి పడి.. రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి!
author img

By

Published : Oct 31, 2021, 11:07 AM IST

రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి దృశ్యాలు

ఇంటి మేడపై ఆడుకుంటుండగా రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కిందకు పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి ఇరుకైన సందులో పడిపోయింది. రెండు గోడల మధ్య ఉన్న ఆరు అంగుళాల స్థలంలో చిన్నారి ఇరుక్కుపోయింది. ఒడిశా కటక్​లోని (Cuttack Odisha news) చౌడ్​వార్​ ప్రాంతంలో శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది.

బాలిక అరుపులు విన్న ఆమె తల్లి.. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. చుట్టుపక్కల వారు సైతం అక్కడికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

the-baby-fell-from-15-foot-roof-in-cuttack
చిన్నారిని బయటకు తీసిన తర్వాత..

హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గోడలకు రంధ్రం చేసి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యకరంగానే ఉందని సమాచారం.

ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తూ...

ఇదీ చదవండి: సైకోప్రేమికుడిపై గ్రామస్థుల దాడి.. చివరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.