సీబీఐ చేతికి తంజావూరు 'విద్యార్థిని ఆత్మహత్య కేసు' - Thanjavur Student Death Case
Thanjavur Student Death Case: తమిళనాడులో ఇటీవల సంచలనం సృష్టించిన తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించింది మద్రాస్ హైకోర్టు.
Thanjavur Student Death Case: ఇటీవల తమిళనాట సంచలనంగా మారిన తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించింది మద్రాస్ హైకోర్టు. ఈ మేరకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థిని చదువుతున్న పాఠశాలలో బలవంతంగా మతమార్పిడికి యత్నించడం వల్లే ఆ ఒత్తిడికి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది.
అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.
ఏమైందంటే..?
Thanjavur Student Case: అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. సేక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది.
ఆ విద్యార్థిని జనవరి 15న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు.. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆమె మృతిచెందినట్లు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య- బలవంతపు మతమార్పిడే కారణమా?