ETV Bharat / bharat

తెలుగు భాషకు పట్టం.. ఆ రాష్ట్రంలోని స్కూళ్లలో బోధన - మధ్యప్రదేశ్ స్కూళ్లలో తెలుగు

Telugu in Madhya Pradesh schools: మధ్యప్రదేశ్​ స్కూళ్లలో 'అ, ఆ, ఇ, ఈ'లు వినిపించనున్నాయి. తేనెలొలికే తెలుగు పదాలు అక్కడి విద్యార్థులు నోటి వెంట రానున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయంతో.. మధ్యప్రదేశ్ స్కూళ్లలో త్వరలో తెలుగు బోధించనున్నారు.

Telugu teaching in Madhya Pradesh
Telugu teaching in Madhya Pradesh
author img

By

Published : Feb 21, 2022, 1:26 PM IST

Telugu in Madhya Pradesh schools: ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగును బోధించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఇతర రాష్ట్రాల భాషలను విద్యార్థులకు బోధించనున్నట్లు మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తెలుగుతో పాటు మరాఠీ, పంజాబీ భాషలను సైతం విద్యార్థులకు నేర్పనున్నట్లు చెప్పారు.

Telugu teaching in Madhya Pradesh:

"మధ్యప్రదేశ్.. దేశానికి హృదయం లాంటిది. రాష్ట్ర విద్యార్థులకు తమిళం తెలిస్తే.. తమిళనాడుకు వెళ్లి వారి భాషలోనే మాట్లాడొచ్చు. హిందీ మాట్లాడే ప్రజలు తమ భాషను గౌరవిస్తారని తమిళనాడు ప్రజలు భావిస్తారు. తద్వారా హిందీ భాషకూ గౌరవం పెరుగుతుంది. భాషా వ్యతిరేకత క్రమంగా తగ్గుతుంది."

-ఇందర్ సింగ్ పర్మార్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి

Telugu in MP schools:

దేశంలోని ఇతర రాష్ట్రాల భాషల గురించి విద్యార్థులకు అవగాహన ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు పర్మార్. 52 జిల్లాల్లోని ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో తెలుగు, పంజాబీ, మరాఠీ భాషలను బోధిస్తామని పేర్కొన్నారు.

మాతృభాషలో వృత్తి విద్యా కోర్సులు

మధ్యప్రదేశ్​లో ఇంజినీరింగ్ విద్యను హిందీలో బోధించాలని అక్కడి సర్కారు ఇదివరకే నిర్ణయించింది. వైద్య విద్యను సైతం హిందీలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై రిపబ్లిక్ డే ప్రసంగంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేశారు. వృత్తి విద్యా కోర్సులను సైతం మాతృభాషలో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.