ETV Bharat / bharat

TDP Leader Remand: అర్ధరాత్రి కరెంటు తీసి.. మఫ్టీలో వచ్చి.. తలుపు తట్టి.. అన్వర్‌బాషాను పట్టుకెళ్లిన పోలీసులు

TDP Minority Leader Anwar Basha Remand: మాచర్లలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేత సయ్యద్‌ అన్వర్‌బాషాను బుధవారం అర్ధరాత్రి మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్టు చేశారు. ఒక గంటలో విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు.. తెల్లవారినా పంపకపోవడం, ఎక్కడ ఉంచారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం బాషాను న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు.

TDP Minority Leader Anwar Basha Remand
TDP Minority Leader Anwar Basha Remand
author img

By

Published : Jun 30, 2023, 9:43 AM IST

TDP Minority Leader Anwar Basha Remand: పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేత సయ్యద్‌ అన్వర్‌బాషాను బుధవారం అర్ధరాత్రి మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్టు చేశారు. ఒక గంటలో విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు.. తెల్లవారినా పంపకపోవడం, ఎక్కడ ఉంచారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందారు. నియోజకవర్గంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఆరా తీసినా అన్వర్​ గురించి సమాచారం తెలుసుకోలేపోయారు. ముస్లింల పర్వదినం బక్రీద్‌ వేళ అరెస్టు చేయడం, ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు మానసిక క్షోభ అనుభవించారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం బాషాను న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు. కారంపూడిలో ఇటీవల జరిగిన గొడవ కేసులో జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు.

క్రియాశీలకంగా ఉన్నారనే..: మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి అన్వర్‌బాషా ప్రధాన అనుచరుడు. ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్రను మాచర్లలో విజయవంతం చేయడంలో అన్వర్​ కీలకపాత్ర పోషించారు. కాగా, ఆ రోజు పట్టణంలో డీజే పెట్టి పాటలతో హడావుడి చేయడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో టీడీపీకి క్రియాశీలకంగా ఉండటం, అలాగే పార్టీకి గట్టిగా పని చేస్తుండటంతో వేధించడానికి అక్రమ కేసులు పెట్టారన్న ఆరోపణలూ ఉన్నాయి.

కారంపూడిలో ఈ నెల 20వ తేదీ ఉదయం వైఎస్సార్​సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్​సీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు టీడీపీ నేతలతోపాటు ఇతరుల పేర్లతో కేసు నమోదు చేశారు. ఇందులో ఇప్పుడు సయ్యద్‌ అన్వర్‌ బాషా పేరును చేర్చారు. ఈ కేసులోనే కారంపూడి పోలీసులు బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. కారంపూడి ఘటనతో అన్వర్‌కు సంబంధం లేకపోయినా కావాలనే హత్యాయత్నం కేసులో ఇరికించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో తీసుకెళ్లొద్దని వేడుకున్నా..: మాచర్ల జెండా చెట్టు ప్రాంతంలోని బుచ్చమ్మ బజారులో నివాసం ఉంటున్న సయ్యద్‌ అన్వర్‌బాషా ఇంటికి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో పోలీసులు వచ్చారు. ఆ సమయంలో కరెంటు సరఫరా లేదు. ఇంటి తలుపు కొట్టడంతో తలుపు తీయగా.. అన్వర్‌ కావాలని అడిగినట్లు అతని తల్లి మీరాబీ చెప్పారు. తాము పోలీసులమని.. అన్వర్‌ను తమతో పంపితే చిన్న విచారణ ఉందని, గంటలో పంపిస్తామని చెప్పారు. అయితే తమ అబ్బాయి గొడవలకు వెళ్లే వ్యక్తి కాదని, ఏదైనా ఉంటే మధ్యాహ్నం సమయంలో రావాలని, తాము ఎక్కడికీ పారిపోబోమని పోలీసులతో తల్లి మీరాబీ చెప్పారు.

ఇలా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని వారిని ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోని పోలీసులు అన్వర్‌ను తీసుకుని వెళ్లిపోయారు. అందరూ సివిల్‌ దుస్తుల్లో ఉండటం, గుర్తు పట్టడానికి వీలులేకపోవడంతో ఎవరు తీసుకెళ్లారో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పోలీసులమంటూ వచ్చి అన్వర్‌ను తీసుకెళ్లిన వారు పోలీసులా.. ఇతరులా అన్న అనుమానంతో అన్వర్‌ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు, బంధువులు తీవ్రంగా గాలించారు.

అర్ధరాత్రి.. ఏమిటీ దారుణం: ‘‘అర్ధరాత్రి వేళ వచ్చి హడావుడి చేసి మహిళలు, పిల్లలను భయాందోళనలకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? వచ్చినవారంతా గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. పోలీసులు పగటివేళ వచ్చి తీసుకెళ్లవచ్చు. రాత్రి అయినా తాము ఫలానా పోలీసుస్టేషన్‌ నుంచి వచ్చామని, ఫలానా కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పవచ్చు. అవేవీ చెప్పకుండా ఎలా తీసుకెళ్లారు? పోలీసుల పేరుతో ఎవరైనా తీసుకెళ్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఆడవారు అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్లి వెతకాలి? సాయంత్రం వరకూ ఎవరు.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. కనిపించిన ప్రతి ఒక్కరినీ.. అన్వర్‌ను చూపించాలని అడుగుతూనే ఉన్నాం’’ అని తల్లి సయ్యద్‌ మీరాబీ, భార్య ఆయేషా ఆందోళన వ్యక్తం చేశారు.

మాచర్లలో ఉంటున్న అన్వర్‌ను కారంపూడి ఘటనలో.. అదీ కావాలని బక్రీద్‌ పండగ వేళ అరెస్టు చేయడంపై ముస్లిం సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పుడో వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో ఇప్పటికిప్పుడు అరెస్టు చేయడమేంటని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలనే బక్రీద్‌ రోజు అరెస్టు చేసి కక్ష తీర్చుకున్నారని వారు ఆరోపించారు.

న్యాయమూర్తి ఇంటి దగ్గర హాజరు..: కారంపూడిలో ఇటీవల జరిగిన టీడీపీ, వైఎస్సార్​సీపీ ఘర్షణ కేసులో నిందితునిగా అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయనను న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా అన్వర్​కు 14 రోజుల రిమాండు విధించారు.

సంబంధం లేని కేసులో ఇరికించారు: అన్వర్‌బాషా: తనకు సంబంధం లేని కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని సయ్యద్‌ అన్వర్‌ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తన కూతురును ఎత్తుకొని భోరున విలపించారు. ఇంతకంటే తనను ఇంకేం చేయగలరని ప్రశ్నించారు. తనను ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లిన కారంపూడి ఎస్సై.. స్టేషన్‌కు వెళ్లాక కొట్టారన్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో తనను 13వ ముద్దాయిగా పెట్టినట్లు పోలీసులు చెప్పారన్నారు. ఆ గొడవకు, తనకు సంబంధం లేదన్నారు. తనలాంటి అమాయకుల ఉసురు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించారు. కేసులు పెట్టడం మినహా ఇంకేం చేస్తారు.. పోతే పోయేది ప్రాణమేగా అంటూ అన్వర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు.

పండుగ పూట అన్వర్ కుటుంబానికి కన్నీరు: మాచర్ల టీడీపీ కార్యకర్త సయ్యద్ అన్వర్ బాషా అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. బక్రీద్ పండుగ రోజున తప్పుడు కేసు పెట్టి ఒక ముస్లిం సోదరుడిని అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి.. ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక రాక్షస రాజ్య నడుస్తుందా అంటూ ధ్వజమెత్తారు. తన తండ్రిని తీసుకెళ్తున్నారని తల్లడిల్లుతున్న ఆ బిడ్డకు మీరేం సమాధానం చెబుతారని చంద్రబాబు నిలదీశారు. ముస్లిం మైనార్టీలపై జగన్ రెడ్డి తన సైకోయిజాన్ని మరోసారి ప్రదర్శించారని నారా లోకేశ్ ఆరోపించారు. పండుగ పూట అన్వర్ కుటుంబానికి కన్నీరు మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా...లేక రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా....మీకు మానవత్వం ఉందా...? ఒక ముస్లిం సోదరుడిని బక్రీద్ పండుగ రోజు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి...ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి పండుగ పూట జైలుకు పంపుతారా?
    మాచర్లలో… pic.twitter.com/lbqkVgZFuO

    — N Chandrababu Naidu (@ncbn) June 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ముస్లిం మైనారిటీల‌పై త‌న సైకోయిజాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు జ‌గ‌న్ రెడ్డి. త్యాగానికి ప్ర‌తీక అయిన బ‌క్రీద్ పండ‌గ రోజు క‌క్ష క‌ట్టి మ‌రీ మాచర్ల టిడిపి కార్యకర్త అన్వర్ ని అక్ర‌మ అరెస్టు చేయించారు. బ‌క్రీద్ జ‌రుపుకోకుండా అన్వ‌ర్‌ని అరెస్టు చేయించి, కుటుంబానికి పండ‌గ పూట క… pic.twitter.com/nq9AOEKnhh

    — Lokesh Nara (@naralokesh) June 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.