రూ.10 నాణేలు చెల్లవని తమిళనాడు, సేలం జిల్లా ధర్మపురిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దుకాణదారులు.. కస్టమర్ల నుంచి పది రూపాయల నాణేలను స్వీకరించలేదు. రూ.10 నాణేలు చెల్లట్లేదన్న వదంతును ఆపేందుకు ఆరూరుకు చెందిన వెట్రివేల్ వినూత్నంగా ఆలోచించాడు. కేవలం రూ.10 నాణేలను సేకరించి.. వాటితోనే కారు కొనాలని నిర్ణయించుకున్నాడు.
దేవాలయాలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, రోడ్డు పక్కన ఉండే షాపులు వంటి వివిధ ప్రదేశాల్లో రూ.10 నాణేలను సంపాదించాడు వెట్రివేల్. ఆ తర్వాత పది రూపాయల నాణేలు మూటలుగా కట్టి భద్రపరిచాడు. అనంతరం కారును కొనేందుకు సేలంలోని షోరూమ్‌కు వెళ్లాడు.
సేలంలోని ఓ ప్రముఖ కారు షోరూమ్‌కు వెళ్లి రూ.10 రూపాయల నాణేలతో కారును కొనాలనుకుంటున్నానని వెట్రివేల్ చెప్పాడు. బ్యాంకు అధికారులను సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని చెబుతామని షోరూమ్ సిబ్బంది అన్నారు. రూ.10 నాణేలను షోరూమ్ నుంచి బ్యాంక్ స్వీకరించేందుకు అభ్యంతరం చెప్పకపోవడం వల్ల వెట్రివేల్‌కు కారును అమ్మేందుకు షోరూమ్ అంగీకరించింది.
బంధువులతో కలిసి వెట్రివేల్.. సేలంలోని కారు షోరూమ్‌కు వెళ్లాడు. ఆరు లక్షల రూపాయల విలువ గల పది రూపాయల నాణేలను షోరూమ్ దగ్గర లెక్కించి ఇచ్చాడు. దీంతో కార్ షోరూమ్ సిబ్బంది.. వెట్రివేల్‌కు కారును అప్పగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది రూపాయల నాణెం ఎప్పటికీ చెల్లుబాటు అవుతుందని ప్రజలకు తెలియజేసేందుకే ఇలా చేశానని వెట్రివేల్ అన్నాడు.
ఇవీ చదవండి: తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు టెన్త్ టాపర్.. రోజూ 10కి.మీ నడిచి బడికెళ్లి..