ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరు వాహనాలు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Five of family dead in Cuddalore pileup
Five of family dead in Cuddalore pileup
author img

By

Published : Jan 3, 2023, 9:30 AM IST

Updated : Jan 3, 2023, 12:28 PM IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై 6 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. మంగళవారం ఉయదం కడలూరు జిల్లా వెప్పూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం ఇలా జరిగింది...
చెన్నై సమీపంలోని నంగనల్లూర్​కు చెందిన విజయరాగవన్​ కారులో చైన్నైకి వెళ్తున్నాడు. అతడితో పాటు అతడి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు కూడా కారులోనే ఉన్నారు. ఇయ్యనార్​పాలాయం వద్ద ఫ్లైఓవర్​ వర్క్​ జరుగుతుండడం వల్ల ట్రాఫిక్​ జామ్​ అయింది. దీంతో విజయ రాఘవన్​ కారును ఆపాడు ఈ క్రమంలో వేగంగా వస్తున్న లారీ ఆగివున్న రాఘవన్​ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం ఆ కారు ముందున్న మరో కారును ఢీకొట్టింది. అలా ముందున్న మరో లారీ మధ్యలో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. వెప్పూర్​ అగ్నిమాపక దళ సిబ్బంది సహాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్​ పారిపోయాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Jan 3, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.