దీపావళి సందర్భంగా సూరత్‌కు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కానుకగా ఇచ్చింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ నిర్వహకులు సుభాష్ దావర్ తెలిపారు.
"కంపెనీ ఆదాయానికి ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ భారమే అయింది. కానీ భవిష్యత్‌లో ఇంధన ఖర్చు ఉండదు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది."
-సుభాష్ దావర్
దీపావళి కానుకగా కంపెనీ నుంచి దాదాపు 35 స్కూటీలను ఉద్యోగులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.