Erra Gangi Reddy Bail Petition: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల కేసు అంశాన్ని ఈ రోజు విచారించిన సుప్రీం.. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదే కేసుకు సంబంధించిన మిగిలిన పిటిషన్లను కూడా ఇదే పిటిషన్‌కు జతచేయాలని ఉన్నత న్యాయస్థానం అదేశించింది. వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయవాది సమర్థించారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది.
వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ1 నిందితుడిగా ఉండగా.. గంగిరెడ్డిని జులై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం సునీత ధాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి బెయిల్ షరతులను ఎనిమిదో వింతగా పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేస్తూ ఫలానా రోజు విడుదలని ఎలా ఆదేశిస్తారని వాదనలు వినిపించారు. తాము కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. ఒక్క రోజు సమయం ఇచ్చి విచారణ చేపట్టాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంలో తాము కూడా ఒక ప్రత్యేక ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసినట్లు గంగిరెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. గంగిరెడ్డి వేసిన మరో ఎస్‌ఎల్‌పీని సునీత పిటిషన్‌కు జతచేసి.. విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని కలిపి ఈ నెల 26 వ తేదీని విచారణ చేపడ్తామని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం : వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై గతంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ.. గత నెలలో తెలంగాణ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసిన విషయం విదితమే. జూన్ చివరిలోగా దర్యాప్తును పూర్తి చేయాలని దేశోన్నత న్యాయస్థానం గడువు విధించింది. ఈ క్రమంలో జులై 1న ఎర్ర గంగి రెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఉత్వర్వుల్లో తెలిపింది.
ఇవీ చదవండి :